కేంద్రం ప్రకటనతో మెగా హీరో మూవీ ప్లాన్‌ చేంజ్‌

కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను దశల వారీగా సడలిస్తూ వస్తుంది.

అన్లాక్ 5లో భాగంగా ఈ నెల 15 తారీకు నుండి థియేటర్లను ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లను తెరిచేందుకు యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి.

ఈ సమయంలో కొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.అక్టోబర్ 15న విడుదలయ్యే సినిమాలు ఏంటి అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు కానీ మెగా హీరో సాయిధరమ్ తేజ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మొన్నటి వరకు ఈ సినిమాను ఓ టి టి ద్వారా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ థియేటర్ల ఓపెన్ కి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు గా తెలుస్తోంది.

పే ఫర్‌ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

అయితే ఇప్పటి వరకు తెలుగులో కానీ ఇండియాలో కానీ ఇలాంటి పద్ధతిలో సినిమా విడుదల కాలేదు.

కనుక సోలో బ్రతుకే సో బెటర్‌ కు ఎలాంటి ఫలితం వస్తుందో అనే ఉద్దేశంతో అనుమానంగా ఉండగా థియేటర్ లు ఓపెన్ వార్త మేకర్స్‌ ఆలోచనను మార్చుకునేలా చేసింది.

కష్టమో నష్టమో ఏదో ఒకటి అన్నట్లుగా థియేటర్లలో నేనీ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ సినిమా థియేటర్లో ఆడకుంటే వెంటనే ఓటీటీ కి కూడా ఇచ్చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ విషయమై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా నభా నటేష్‌ నటించిన విషయం తెలిసిందే.

కొత్త దర్శకుడు సుబ్బు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఇలా చేస్తే సహజంగానే నల్లటి కురులు మీ సొంతమవుతాయి!