సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ డేట్ చెప్పేసిన తేజు

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ అతి తక్కువ సమయంలో హీరోగా తన సత్తా చాటుకున్నాడు.

అయితే వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో హిట్ కోసం తహతహలాడిన సాయి ధరమ్ తేజ్, రీసెంట్‌గా ప్రతిరోజూ పండగే సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.

ఈ సినిమాతో తేజు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తేజు, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకు సుబ్బు అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.మరి ఈ సినిమాతో తేజు మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025