రిపబ్లిక్ మూవీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తే గుండె గుబేల్

సినిమా విజయం అనేది ఎప్పుడు.ఎటువైపు తిరుగుతుందో చెప్పడం కష్టం.

తాజాగా రిలీజ్ అయిన సాయి ధరమ్ తేజ్ సినిమా విషయంలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్ల 600 సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా 700 సినిమా హాళ్లలో రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యింది.

కానీ జనాలు ఈ సినిమా పట్ల అంతగా ఆసక్తి చూపించలేదు.చాలా తక్కువ మంది ఈ సినిమా టికెట్లు బుక్ చేసుకున్నారు.

అటు సినిమా ప్రమోషన్ విషయంలోనూ దర్శక నిర్మాతలు పెద్దగా హడావిడి చేయలేదు.పూర్తిగా మౌత్ పబ్లిసిటీ మీదే ఆధారపడ్డారు.

కొంత మంది మెగా హీరోలు ఈ సినిమా గురించి ప్రమోట్ చేసినా టికెట్ల బుకింగ్ విషయంలో అది పెద్దగా రిఫ్లెక్ట్ కాలేదు.

ఇక రీలీజ్ విషయానికి వస్తే.టోటల్ గా 600 సినిమా థియేటర్లలో ఓవరాల్ ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది.

15 శాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.అటు ఆంధ్రాలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.

టెకెట్ల రేట్లతో పాటు 50 శాత అక్యుపెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈవినింగ్, నైట్ షోలకు కాస్త బుకింగ్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

అన్ని బాగుంటే తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్ల వరకు ఓపెనింగ్స్ ఉండేలా ఉంది.

కానీ ఈ గ్రోత్ చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. """/"/ ఇక సినిమా బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఓపెన్సింగ్ చాలా సాదా సీదా అనుకోవచ్చు.

ఈవినింగ్, నైట్ షోలకు జనాలు పోటెత్తితే మాత్రం పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది అనుకోవచ్చు.

ఇదే మాదిరిగా ఉంటే మాత్రం చాలా కష్టం అనే భావనకు వస్తున్నారు సినీ జనాలు.

అయితే సినిమా విషయంలో పాజిటివ్ టాక్ వస్తుండటంతో సినిమాకు రోజు రోజు జనాలు పెరిగే అవకాశం ఉందనే టాక్ నడుస్తుంది.

పంచదార కాదు బాస్.. బెల్లం టీ తాగితే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం!