విరూపాక్ష టీజర్ చూశారా.. ఆ ట్విస్ట్ లతో థియేటర్లో పూనకాలు గ్యారెంటీ అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష.
కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ నటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై సాయి ధరమ్ తేజ్ అభిమానులు భారీగానే అంటున్నాడు.
బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.
"""/" /
ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అన్న క్యూరియాసిటీ ప్రేక్షకులలో నెలకొంది.
ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో సమ్మర్ కానుకగా ఏప్రిల్ 21వ తేదీన గ్రాండ్గా విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రమోషన్స్ ను మొదలు పెట్టిన చిత్ర బృందం తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు.
1.19 లు నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
టీజర్ చూస్తున్నంత సేపు ఊపిరి బిగపట్టుకొని చూసేలా టీజర్ ఉంది.కాగా తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
"""/" /
ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టడం గ్యారంటీ అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఈ సినిమాలోని డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.అలాగే టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత హైప్ ని తీసుకువచ్చింది.
తాజాగా విడుదలైన ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.
మరి భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ విరూపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ కి ఏ మేరకు సక్సెస్ ని తెచ్చి పెడుతుందో చూడాలి మరి.
మెగా అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ మరోవైపు పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు.
చరణ్ మాటలు నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండగే.. అసలేం జరిగిందంటే?