పోటీ లేకున్నా మెగా హీరో మూవీకి అరకొర థియేటర్లే

కరోనా లాక్‌ డౌన్‌ కు ముందే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడ్డాయి.

లాక్‌ డౌన్‌ టైమ్‌ లో థియేటర్ల గురించే జనాలు ఆలోచించలేదు.మెల్ల మెల్లగా అన్‌లాక్‌ చేస్తూ వచ్చారు.

రెండు నెలల క్రితం థియేటర్లకు కూడా అన్‌ లాక్‌ చేశారు.కాని జనాలు మాత్రం పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు.

వారికి కరోనా భయం డామినేట్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఇక థియేటర్లు ఓపెన్‌ కు అనుమతులు ఇచ్చినా కూడా నిర్మాతలు మాత్రం తమ సినిమాలను విడుదల చేసేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారు.

ఎట్టకేలకు లాక్‌ డౌన్‌ తర్వాత మొదటగా పెద్ద సినిమాగా సోలో బ్రతుకే సోబెటర్‌ విడుదలకు సిద్దం అయ్యింది.

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా ఓటీటీ కి వెళ్లాలని అనుకున్నా థియేటర్లు ఓపెన్‌ చేయడంతో రూటు మార్చుకుని థియేటర్ల వైపుకు నడుస్తోంది.

"""/"/ క్రిస్మస్‌ కానుకగా ఈనెల 25వ తారీకున మెగా మూవీ సోలో బ్రతుకే సోబెటర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది.

ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాలు ఏ ఒక్కటి లేవు.కనీసం చిన్న సినిమాలు కూడా విడుదలకు ఆసక్తిగా లేవు.

ఇలాంటి సమయంలో సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా భారీ ఎత్తున విడుదల అవ్వాల్సి ఉంది.

రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తారేమో అనుకున్నారు.కాని కేవలం 500 స్క్రీన్స్‌ లో మాత్రమే ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక తెలుగు సినిమాలు గతంలో వేరే రాష్ట్రంలో వేరే దేశాల్లో కూడా విడుదల అయ్యేవి.

కాని ఈ సినిమా మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదల అవుతుంది.

అది కూడా తక్కువ థియేటర్లలో విడుదల అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తక్కువకు కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

బిష్కెక్‌లో తిరిగి సాధారణ పరిస్ధితులు : భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన