అమ్మతో గొడవ పడి రెండేళ్ల సమయం తీసుకున్న మెగా హీరో

ఈ మద్య కాలంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లికి సంబంధించి ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాదిలో వివాహ నిశ్చితార్థం వచ్చే ఏడాది పెళ్లి చేసుకునేందుకు సాయి ధరమ్‌ తేజ్‌ రెడీ అవుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సాయి ధరమ్‌ తేజ్‌ మరోసారి ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

గతంలోనే ఇప్పుడు నా పెళ్లి ఏమీ లేదు అంటూ చెప్పిన ఈ మెగా హీరో తాజాగా మరో సారి పెళ్లి విషయంలో ఫుల్‌ క్లారిటీ ఇచ్చి మీడియాలో వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు.

నాకు అమ్మకు పదే పదే పెళ్లి విషయమై గొడవ జరుగుతూనే ఉంది.అమ్మ నా పెళ్లిని త్వరగా చేయాలని భావిస్తుంది.

కాని నేను మాత్రం రెండు సంవత్సరాలు సమయం కావాల్సిందే అంటున్నాను.ఈ విషయంలో నాకు అమ్మకు పదే పదే గొడవ జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు మా ఇద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం నేను అడిగిన రెండు సంవత్సరాల టైం పై కుటుంబంలో చర్చ జరుగుతోంది.

"""/"/ అమ్మ ఇతర కుటుంబ సభ్యులు చేస్తున్న చర్చల తర్వాత నాకు రెండు సంవత్సరాలు టైం ఇస్తారా లేదా అనే విషయం తెలుస్తుంది.

పెళ్లి విషయంలో ఇంకా చాలా టైం కావాలని కోరుకున్నాను.కాని కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మ ఒత్తిడితో రెండేళ్ల తర్వాత చేసుకోవాలనుకున్నాను.

ఒక అమ్మాయిని ఎంపిక చేసుకుని ఆ అమ్మాయిని అర్థం చేసుకునేందుకు సమయం కావాలి.

చూసిన వెంటనే పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం కదా అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.

మొత్తానికి సాయి ధరమ్‌ తేజ్‌ రాబోయే రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవడం అయితే కన్ఫర్మ్‌ అయ్యింది.

నేషనల్ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నానన్న సాయిపల్లవి.. ఆ అదృష్టం వరిస్తుందా?