Sai Dharam Tej : మీడియా ప్రతినిధికి అలాంటి ఆన్సర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఇది ఆ తరహా చిత్రం కాదంటూ?
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష( Virupaksha ).
ఈ సినిమా నేడు అనగా ఏప్రిల్ 21వ తేదీన గ్రాండ్ గా విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే.
కార్తీక్ దండు( Karthik Dandu ) దర్శకత్వం వహించిన ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.
90 దశకంలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.
హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత నటించిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. """/" /
తాజాగా విడుదల అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.
ఇది ఇలా ఉంటే చిత్ర యూనిట్ ఒక మీడియా సమావేశం నిర్వహించగా అందులో ఒక ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది.
అదేమిటంటే విరూపాక్ష చిత్రానికి ఊహించని విధంగా సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.
ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు సాయిధరమ్ తేజ్ ని ప్రశ్నిస్తూ.విరూపాక్ష చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు.
మీకు సంయుక్త మధ్య రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయా లేక భయానక సన్నివేశాలు ఉండడం వల్లనా అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నల పై స్పందించిన సాయి ధరమ్ తేజ్. """/" /
మీడియా ప్రతినిధితో జోకులు వేస్తూ ఇది మీరు అనుకుంటున్నట్లు ఆ తరహా సినిమా కాదు.
కానీ ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎగ్జైట్ చేస్తుంది.కానీ మీరు అనుకున్న విధంగా ఎగ్జైట్ చేయదు అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.
తేజు సమాధానం విన్న సంయుక్తా మీనన్ పడి పడి నవ్వుతూ కనిపించింది.
ఆ వెంటనే దర్శకుడు కార్తీక్ దండు స్పందిస్తూ.ఈ సినిమాలో వణుకు పుట్టించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.
అలాగే టెన్షన్ పెట్టే సన్నివేశాలు కూడా ఉన్నాయి.అందువల్లే ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.
ఇది ఫ్యామిలీ మొత్తం కలసి చూడాల్సిన చిత్రం అని చెప్పుకొచ్చారు కార్తీక్ దండు.
ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..