350 మంది అభిమానులకు లంచ్ ఏర్పాటు చేసిన సాయితేజ్.. ఈ మెగా హీరో గ్రేట్!
TeluguStop.com
టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) గురించి మనందరికీ తెలిసిందే.
తెలుగులో చాలా సినిమాలలో హీరోగా నటించిన గుర్తింపును ఏర్పరచుకున్నారు సాయిధరమ్ తేజ్.ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఆ మధ్య రోడ్డు యాక్సిడెంట్ వల్ల గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత కోలుకున్న విషయం తెలిసిందే.
అయితే యాక్సిడెంట్ తర్వాత కోలుకున్నప్పటి నుంచి సాయి ధరంతేజ్ కాస్త స్లోగానే ఉన్నారని చెప్పాలి.
ఏది పడితే అది చేయకుండా చాలా సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే సాయి ధరం తేజ్ తన అభిమానులను ఎంత ప్రేమగా చూసుకుంటారు మనందరికీ తెలిసిందే.
"""/" /
తాజాగా జరిగిన ఘటన అందుకు చక్కటి ఉదాహరణగా కూడా చెప్పవచ్చు.
ప్రస్తుతం సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా ( Atigattu Movie )షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే షూటింగ్ వద్దకు వచ్చిన వందల మంది అభిమానులకు ప్రత్యేకంగా భోజనం పెట్టించారు సాయి ధరమ్ తేజ్.
అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్క అభిమానితో ఫోటో దిగి మరి పంపించారు.అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తేజ్ అన్నా చాలా గొప్పవాడు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. """/" /
కాగా తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కు( Glimpses Of The Movie Title ) వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే.
తేజ్ ఈ చిత్రం కోసం బాడీని బాగానే పెంచేశాడు.మునుపెన్నడూ చూడని లుక్కులో తేజ్ కనిపించబోతోన్నాడు.
ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా తేజ్ క్రేజ్ పెరిగేలా ఉంది.
సంబరాల ఏటి గట్టు మూవీ షూటింగ్ వద్దకు దాదాపు 350 మందికి పైగా అభిమానులు వచ్చారట.
తనకోసం వచ్చిన అభిమానుల కోసం ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశాడట.అందరికీ కడుపు నిండా అన్నం పెట్టించి మరీ పంపించారట సాయి ధరమ్ తేజ్.
డైరెక్టర్ తో కలిసి తిరుమల వెళ్లిన సమంత…. బలపరుస్తున్న డేటింగ్ రూమర్లు!