మెగా ఫ్యామిలీ హీరోలు రెండు పార్టీలుగా పోయారా… వెలుగులోకి షాకింగ్ విషయాలు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో మెగా కుటుంబం ఒకటి.

చిరంజీవి( Chiranjeevi ) ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయన ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పాలి.

ఇప్పటికే మెగా కుటుంబం నుంచి ఒక క్రికెట్ టీం లో ఉండే ప్లేయర్స్ లాగా హీరోలు అంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

చిరంజీవి హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) నాగబాబు( Nagababu ) ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

అయితే నటుడిగా నాగబాబు పెద్దగా సక్సెస్ కాకపోయిన నిర్మాతగా అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ గుర్తింపు పొందారు.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన తక్కువ సినిమాలు చేసిన ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇలా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) అడుగుపెట్టి ఈయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని తండ్రికి మించిన తనయుడు అని గుర్తింపు పొందారు.

"""/" / ఇలా రాంచరణ్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు కూడా ఎంట్రీ ఇచ్చారు అదే విధంగా నాగబాబు వారసుడిగా వరుణ్ తేజ్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

అలాగే చిరంజీవి మేనల్లుళ్లు అయినటువంటి సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్( Sai Dharam Tej, Vaishnav Tej ) వంటి వారందరూ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ హీరోలందరూ కూడా విభిన్న కథ చిత్రాలలో నటిస్తూ ఎవరికి వారు ఇండస్ట్రీలో గుర్తింపు పొందడం కోసం కష్టపడుతున్నారు.

ఇక మెగా కుటుంబంలో హీరోలుగా ఉన్నటువంటి వరుణ్ సాయి ధరంతేజ్ వైష్ణవ్ ముగ్గురు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరు మెగా కుటుంబానికి సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

"""/" / ఈ సందర్భంగా వీరికి ఒక ప్రశ్న ఎదురయింది.అసలు మీ ఇంట్లో ఉన్నటువంటి ఇంతమంది హీరోలలో చిరంజీవికి ఇష్టమైనటువంటి హీరోలు ఎవరు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ సమాధానం చెబుతూ మా ఇంట్లో ఉన్నటువంటి మేమంతా కూడా రెండు పార్టీలుగా విడిపోతామని తెలియజేశారు.

చరణ్ వరుణ్ ఇద్దరూ కూడా పెద్దమామయ్య చిరంజీవి గారి పార్టీ నేను వైష్ణవ్ చిన్న మామయ్య కళ్యాణ్ పార్టీ అంటూ ఈ సందర్భంగా సాయి తేజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా మెగా కుటుంబంలోని ఈ హీరోలు ఇంట్లో కూడా కొంతమంది హీరోలు పవన్ ఫ్యాన్స్ కావడం మరికొంతమంది హీరోలు చిరు ఫ్యాన్స్ అని తెలియడంతో మెగా అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!