'సాహో' అక్కడ పరువు నిలిపింది

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'సాహో' చిత్రం విడుదలై నేటితో వారం పూర్తి చేసుకోబోతుంది.

ఈ వారం రోజుల్లో సినిమా కలెక్షన్స్‌ విషయాన్ని చూస్తే చాలా బెటర్‌గా అనిపించాయి.

సినిమాకు వచ్చిన టాక్‌తో కనీసం 100 కోట్లు అయినా వసూళ్లు చేస్తుందా అని అంతా అనుకున్నారు.

కాని ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 10 వేల థియేటర్లలో ఈ చిత్రం విడుదల అయిన కారణంగా ఈ చిత్రం తప్ప మరే సినిమా చూసే అవకాశం లేదన్నట్లుగా ఇండియాలో భారీగా ఈ చిత్రంపై జనాలు పడ్డారు.

"""/"/ బాహుబలి చిత్రంతో ఇండియాస్‌ స్టార్‌ అయిన ప్రభాస్‌ సాహో చిత్రంతో అక్కడ మరోసారి తన సత్తా చాటాడు.

తనకున్న స్టార్‌డంతో సినిమా ఫ్లాప్‌ అయినా కూడా కలెక్షన్స్‌ను బాగానే తెచ్చి పెట్టాడు.

సాహో చిత్రంను హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ 80 కోట్లకు కొనుగోలు చేసింది.

థియేట్రికల్‌ రైట్స్‌ మరియు హిందీ శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా భారీ మొత్తంను దక్కించుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు వారికి మాత్రం నెత్తిన టోపీ పెట్టినట్లే అంటూ అంతా కామెంట్స్‌ చేశారు.

హిందీలో ఈ సినిమాకు భారీగా నెగటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో చాలా డ్యామేజీ జరగడం ఖాయం అనుకున్నారు.

అయితే సినిమాలో ఉన్న హై బడ్జెట్‌ ఎలిమెంట్స్‌ మరియు ఇతరత్ర విషయాల కారణంగా హిందీ ప్రేక్షకులు సాహో చిత్రాన్ని ఆధరిస్తున్నారు.

మొదటి అయిదు రోజుల్లో దాదాపుగా 110 కోట్ల గ్రాస్‌ వసూళ్లు అక్కడ నమోదు అయ్యాయి.

బాలీవుడ్‌ యేతర హీరో అక్కడ వంద కోట్లను సాధించడం అంటే ఎవరికి సాధ్యం కాదు.

బాహుబలి తర్వాత మళ్లీ సాహోకే ఆ రికార్డు సాధ్యం అయ్యింది.మరి కొన్ని రోజుల పాటు కాస్త సందడి కొనసాగితే హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసిన నిర్మాతలకు లాభాలు మొదలయ్యే అవకాశం ఉంది.

లాభాల సంగతి పక్కన పెడితే అక్కడ సాహో చిత్రం పరువు నిలిపిందని టాలీవుడ్‌ వర్గాల వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.