జపాన్ లో నూట యాభై రోజులు పూర్తి చేసుకున్న సాహో మూవీ

బాహుబలి సినిమా తర్వాత విదేశాలలో కూడా డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.

ప్రభాస్ సినిమా అంటే ఒక రేంజ్ లో విదేశీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా జపాన్ లో అయితే రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో డార్లింగ్ ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

అతని సినిమా బాహుబలి జపాన్ లో సూపర్ సక్సెస్ అయ్యింది.తరువాత విడుదలైన సాహోకి కూడా అక్కడి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్ తో ఏవరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

అయితే బాలీవుడ్ లో 150 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది.

అక్కడి ప్రేక్షకులు సినిమాని అద్భుతంగా ఆదరించారు.సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి.

ఈ నేపధ్యంలో జపాన్ భాషలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు.ఇక అక్కడ సాహూ సినిమా రికార్డు విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది.

తెలుగు సినిమా కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా సాహో జపాన్ లో రికార్డు సృష్టించింది.

ఇదిలా ఉంచితే ఇప్పుడు జపాన్ లో ఈ సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది.

ఏకంగా అక్కడ థియేటర్ లలో 150 రోజులు పూర్తి చేసుకున్న ఇండియన్ తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.

లాక్ డౌన్ సమయంలో కొద్ది కాలం బ్రేక్ పడిన, మరల అక్కడ కరోనా ప్రభావం తగ్గడంతో థియేటర్లు ఓపెన్ చేశారు.

ఈ నేపధ్యంలో సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి 150 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ రేంజ్ లో సాహో సినిమాకి అక్కడి ప్రేక్షకులు ఆదరించారు అంటే డార్లింగ్ ప్రభాస్ కి ఎంత ఫాలోయింగ్ జపాన్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో రిలీజ్ చేసే రెండు సినిమాలు ఇవే…