అధిక బరువు తగ్గించే సగ్గుబియ్యం.. ఆ బెనిఫిట్స్ కూడా!
TeluguStop.com
సగ్గుబియ్యం.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సగ్గుబియ్యం జావ, సగ్గుబియ్యం వడలు, సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం ఉక్మా ఇలా రకరకాల వంటలు చేస్తుంటారు.
సగ్గుబియ్యంతో ఏ వంటకం చేసినా.అద్భుతంగానే ఉంటాయని చెప్పాలి.
అయితే రుచిలోనే కాదు.అధిక బరువును తగ్గించడంలోనూ, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ సగ్గుబియ్యం గ్రేట్‌గా సహాయ పడుతాయి.
అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు సగ్గుబియ్యం డైట్లో చేర్చుకుంటే మంచిది.ఎందుకంటే, సగ్గుబియ్యం శరీరంలో అదనపు కొవ్వును కరిగించి.
బరువును తగ్గిస్తాయి.అయితే వీటిని ఎక్కువగా మాత్రం తీసుకోరాదు.
అలా చేస్తే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.సగ్గు బియ్యాన్ని పాలలో గాని లేదా నీలలో గాని ఊడికించి తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
మరియు వేడిని తగ్గించి.శరీరాన్ని చల్లబరుస్తుంది.
అలాగే మధుమేహం ఉన్న వారికి కూడా సగ్గుబియ్యం అద్భుతంగా సహాయ పడతాయి.ప్రతి రోజు మితంగా సగ్గుబియ్యం తీసుకుంటే.
బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే సగ్గుబియ్యం తీసుకోవడం ఎముకులు, కండరాలు దృఢంగా మారతాయి.
మరియు గుండె పోటు ఇతర గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.అలాగే సగ్గుబియ్యాన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం అవుతాయి.
ఇక సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి కూడా ఉంటాయి.కాబట్టి, ప్రెగ్నెన్సీ మహిళలు ఖచ్చితంగా సగ్గుబియ్యాన్ని ప్రతి రోజు తీసుకోవాలి.
ఎందుకంటే.ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి కడుపులోని శిశువు ఎదుగుదలకు సహాయపడతాయి.
ఎనర్జీ బూస్టర్ గా సగ్గుబియ్యం ప్రతి రోజు వ్యాయామం తర్వాత తీసుకుంటే.రోజంతా యాక్టివ్‌గా ఉండగలరు.
ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా..?