ఈ మండుటేసవిలో తింటే ఈ వడియాలే తినాలి!
TeluguStop.com
వడియాలకు పెట్టింది పేరు మన ఇరు తెలుగు రాష్ట్రాలు.ఈ మాట వినగానే మన తెలుగువాళ్లు ఎక్కడున్నా తమ గతానికి వెళ్లిపోతుంటారు.
ఎందుకంటే, ఇప్పుడు వడియాల పెట్టుకొని తినే ఓపిక, సమయం ఎవరికీ ఉండడం లేదు కనుక.
అయితే కాస్త సమయం వెచ్చించి వడియాల పెట్టుకొని ఈ వేసవిలో అన్నంలోకి రసమో, పులుసో చేసుకుని తింటుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము.
అయితే వడియాల్లో చాలా రకాలు వున్నాయి.అందులో కొన్నింటి గురించి చూద్దాం.
"""/" /
మొదటగా ఇక్కడ అందిరికీ తెలిసిన సగ్గు బియ్యం వడియాల గురించి మాట్లాడుకోవాలి.
ఇవి సాధారణంగా ఒంటికి చల్లదనం చేకూరుస్తాయి.మనందరికీ వంట్లో వేడి చేసినపుడు సేమియా, సగ్గుబియ్యం ( Sago )కలిపి తాగడం అలవాటే.
అదేవిధంగా ఈ మిశ్రమములతో చాలామంది మన ఇళ్లల్లో వడియాల పెట్టుకుంటూ వుంటారు.దానికోసం సాధారణంగా సగ్గుబియ్యం ఒక కప్పు, నీళ్లు అర కప్పు, సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ జీలకర్ర( Cumin ), కొంచెం కరివేపాకుల మిశ్రమాన్ని వాడుతారు.
"""/" /
తరువాత ముల్లంగి దుంప( Radish ) అంటే మనలో చాలామందికి ఇష్టం.
ఇది కూడా ఒంటికి చల్లదనాన్ని చేకూరుస్తుంది.అయితే దీనిని తినడానికి చాలామంది ఆసక్తి చూపరు.
దానికి ప్రత్యామ్నాయంగా వడియాలు పెట్టుకొని ఎంచక్కా లాగించేయొచ్చు.దానికి కావాల్సినవి పావు కిలో మినపప్పు, అర కిలో ముల్లంగి తురుము, సరిపడా ఉప్పు ఉంటే సరిపోతుంది.
"""/" /
చాలామంది ఇళ్లల్లో ఇది ఫెవరెట్ రెసిపీ.ఆ తరువాత కొంతమంది కారప్పూస వడియాలు కూడా పెట్టుకుంటారు.
ఇంకా ఆలూ మసాలా వడియాలు, రాగిపిండి వడియాలు( Ragi Flour ), బీట్రూట్ ఒడియాలను చాలామంది లొట్టలు వేసుకొని తింటారు.
వలసలకు చెక్ .. యూకే కఠిన చర్యలు , అందుబాటులోకి పటిష్ట యంత్రాంగం