సాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు గల్లంతు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లిన హుజూర్ నగర్ కు చెందిన యువకుడు లచ్చుమల్ల వెంకట్ (21) ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతయ్యాడు.

ఇతను హుజూర్ నగర్ లో జరిగే తన అత్త కొడుకు పెళ్లికి, పెళ్లి కూతురును తీసుకువచ్చేందుకు వెలిదండ గ్రామానికి వచ్చి కాలువలో ఈతకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

గల్లంతైన యువకుడు హుజూర్ నగర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

అతని కొరకు పోలీసులు గజ ఈతగాళ్లు రప్పించి గాలిస్తున్నారు.

ఓ చిన్న టెక్నీషియన్‌కి క్షమాపణలు చెప్పిన దర్శక దిగ్గజం కె.వి.రెడ్డి..?