రేపు సాగర్ సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకిస్తున్న గ్రామస్థులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండల కేంద్రంలోని సాగర్ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ విస్తరణ కోసం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణను స్థానిక ప్రజలు వ్యతిరేఖిస్తున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు.పెదవీడు,మఠంపల్లి గ్రామాలలో తమ సున్నపు రాయి గని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.
8 నుడి 5.4 ఎంటిపిఎకు పెంచుటకు,వీటితో పాటు 1x1000 టిపిహెచ్ క్రషర్ ను నెలకొల్పుటకు ప్రస్తుత మైన్ లీజ్ ఏరియా అయిన 328.
58 హెక్టార్లలో సున్నపురాయి గనిని విస్తరించుటకు ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధికారుల సమక్షంలో సాగర్ సిమెంట్స్ యాజమాన్యం రేపు ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనున్నారు.
దీనికి సంబంధించి సాగర్ సిమెంట్స్ యాజమాన్యం శనివారం ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టేందుకు భారీ పోలీసు బందోబస్తు నడుమ రంగం సిద్దం చేశారు.
ఈ ప్రజాభిప్రాయ సేకరణను పెదవీడు రెవిన్యూ శివారులోని మూతపడిన అమరేశ్వరి సిమెంట్స్ ప్రాంతంలో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు.
స్థానిక ప్రజలు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిశ్రమ ఏర్పడి 40ఏళ్లు అవుతున్నప్పటికీ సంబంధిత గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి సహకరించలేదని విద్యా అర్హతలు ఉన్న స్థానికులకు ఏ ఒక్కరికి ఉద్యోగం కల్పించలేదని ఆరోపిస్తున్నారు.
ఈ పరిశ్రమ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని మైనింగ్ విస్తరణకు అభ్యంతరం తెలుపుతూ ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
స్థానికులు ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, జడ్పీ సీఈఓ,జిల్లా పరిశ్రమ శాఖకు ఫిర్యాదులు చేశామని అన్నారు.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
‘పుష్ప 2’ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి లైన్ క్లియర్ అయిందా..?