సిద్దూ పై కీలక వ్యాఖ్యలు చేసిన సాధు సింగ్

సిద్దూ పై కీలక వ్యాఖ్యలు చేసిన సాధు సింగ్

పంజాబ్ మంత్రి సాధు సింగ్ ధరంసూత్ కీలక వ్యాఖ్యలు చేశారు.పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సిద్దూ పై కీలక వ్యాఖ్యలు చేసిన సాధు సింగ్

తన భార్య నవజ్యోత్ కౌర్ కు టికెట్ రాకపోవడానికి అమరీందర్ కారణం అంటూ సిద్దూ వ్యాఖ్యలు చేశారు.

సిద్దూ పై కీలక వ్యాఖ్యలు చేసిన సాధు సింగ్

అయితే ఈ వ్యాఖ్యలపై అమరీందర్ కూడా ఘూటుగానే స్పందించారు.అమృత్ సర్ లేదా భటిండా స్థానాల్లో ఒక్క స్థానాన్ని ఎంచుకోవాలని ఆమెకు సూచించామని, అయితే మేము ఇచ్చిన ఆఫర్ ను ఆమె తిరస్కరించారని తెలిపారు.

దీనితో ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగడం లేదు.ఈ నేపథ్యంలో మరో మంత్రి సాధు సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరీందర్ తో ఇబ్బంది ఉంటె కేబినెట్ నుంచి తప్పుకోవాల్సింది అని అన్నారు.గతంలో బీజేపీ ని వీడి కాంగ్రెస్ లో చేరారు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ ను వీడితే మరి ఇంకెక్కడకి వెళతారో దేవుడికే తెలియాలి అంటూ ఆయన సెటైర్ వేశారు.

అయితే సిద్దూ వ్యవహారం పై మండిపడుతున్న సాధు సింగ్ సిద్దూ పై హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోపక్క అమరీందర్ కూడా సిద్దు పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో తాజాగా అమరిందర్ మాట్లాడుతూ.

తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధూను చేయాలని సెటైర్ వేశారు.అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా తననే కాకుండా, పార్టీని కూడా డ్యామేజ్ చేశాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.