విడాకులు తీసుకుంటే తప్పేం కాదు… పెళ్లికి నేను వ్యతిరేకం కాదు…సదా షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
జయం సినిమా( Jayam Movie ) ద్వారా నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి సదా( Sadha ) .
మొదటి సినిమాతోనే నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం వరుస తెలుగు తమిళ సినిమా అవకాశాలు అందుకున్నారు.
ఇలా హీరోయిన్ లో కొనసాగుతున్న సదా ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.
అయితే ఈమె సినిమాలకు దూరమైనా బుల్లితెరపై పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
బుల్లితెర పై ప్రసారమవుతున్న డ్యాన్స్ కార్యక్రమలకు జడ్జిగా వ్యవహరిస్తూ కేరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/06/Sadha-bold-statment-about-marriage-and-orceb!--jpg" /
ఇక సదాతో పాటు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారందరూ కూడా ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయ్యారు.
కానీ ఇంకా ఈమె పెళ్లి గురించి మాట్లాడటం లేదు.ఇప్పటికే సింగిల్గానే ఉంటున్నారు.
తాజాగా తన పెళ్లి ( Marriage ) గురించి ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పెళ్లికి తాను వ్యతిరేకం కాదని తెలిపారు.అయితే ఆరెంజ్ మ్యారేజ్ అంటే నాకు నచ్చదని తెలిపారు.
ఎవరో ఏంటో తెలియని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని తన దగ్గర ఉండటం అనే కాన్సెప్ట్ నాకు నచ్చదని నాకు ప్రేమ వివాహాలే నచ్చుతాయని సదా తెలిపారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/06/Sadha-bold-statment-about-marriage-and-orcec!--jpg" /
మా అమ్మ నాన్న కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు.
అందుకే నాకు కూడా ప్రేమ వివాహమే ఇష్టము.అయితే ఇప్పటివరకు సింగల్ గా ఉండడానికి కారణం నాకు సరిపడా వ్యక్తి దొరకకపోవడమేనని తెలిపారు.
ఇప్పుడు నేను తన వ్యక్తిగత జీవితంలోను అలాగే వృత్తి పరమైన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను.
పెళ్లి చేసుకుంటే ఈ హ్యాపీనెస్ ఉంటుందని తాను భావించడం లేదని వెల్లడించారు.ఇక పెళ్లి గురించి మాట్లాడిన ఈమె విడాకుల గురించి కూడా మాట్లాడారు.
పెళ్లి చేసుకున్న తర్వాత మన లైఫ్ పార్ట్నర్ తో మన జీవితం సాఫీగా సాగలేదు కష్టంగా ఉంది అనిపిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పు లేదంటూ కూడా సదా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాలయ్య సినిమాలో నటించబోతున్న స్టార్ హీరోయిన్…