సద్దాం హుస్సేన్ ఇండియాకి చెందినవారేనా.. డిఎన్ఏ విశ్లేషణలో సంచలన నిజాలు..?
TeluguStop.com
ఇరాక్‌లోని( Iraq ) అసాయిబ్ అహ్ల్ అల్-హక్ ఉద్యమ సెక్రటరీ జనరల్ కైస్ అల్-ఖజాలీ( Qais Al-Khazali ) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్( Saddam Hussein ) డిఎన్ఏ విశ్లేషణలో అతను భారతీయ మూలానికి చెందినవాడని రుజువు అయినట్లు పేర్కొన్నారు.
సద్దాం హుస్సేన్ 1979 నుంచి ఇరాక్‌ను పాలించిన ఒక కౄరమైన నాయకుడు.అతను 2003లో యూఎస్ నేతృత్వంలోని దండయాత్రలో యూఎస్ బలగాలు పట్టుకున్నాయి.
2006 డిసెంబర్‌లో ఉరితీశాయి.అయితే అతని గురించి తెలుసుకునేందుకు ఇప్పటికీ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కైస్ అల్-ఖజాలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.కాగా అల్-ఖజలీ తను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు అందించలేదు లేదా డిఎన్ఏ విశ్లేషణ ఎలా నిర్వహించబడిందో వివరించలేదు.
సద్దాం వంశంపై మునుపటి అధ్యయనాల ప్రామాణికత, విశ్వసనీయతను నిర్ధారించడం కూడా కష్టం. """/" /
ఇరాక్‌లోని కొందరు తమ తెగల మూలాలు, భారతదేశం, ఆసియాలోని ఇతర ప్రాంతాలతో చారిత్రక సంబంధాల కలిగి ఉన్నాయా అని చాలా కాలంగా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఎవరికీ ఉపయోగపడని ఈ విషయం తెలుసుకొని ఏం చేస్తారని మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
అయినప్పటికీ, అల్-ఖజాలీ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించింది.దీనిపై ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తున్నారు.
"""/" /
ఇదిలా ఉండగా భారత సంతతికి చెందినవారా కాదా అనేది కచ్చితంగా నిర్ధారించేందుకు బలమైన ప్రూఫ్స్ కంపల్సరీగా ఉండాలి.
స్పష్టమైన, నమ్మదగిన డేటా లేకుండా, వ్యక్తులు లేదా సమూహాల మూలాల గురించి ఒక నిర్ధారణకు రాకూడదు.
మొత్తం మీద సద్దాం హుస్సేన్ పూర్వీకుల ఎవరనే ప్రశ్న చాలా మందికి ఆసక్తిని కలిగి కలిగించినా, ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం.
దృఢమైన సాక్ష్యం, శాస్త్రీయ విశ్లేషణ లేకుండా, చారిత్రక వ్యక్తుల మూలాల గురించిన వాదనలు సీరియస్ గా తీసుకోకూడదు.
అంధ గాయకుడిని ఉద్దేశించి థమన్ పోస్ట్ వైరల్.. అతడిలో గొప్ప టాలెంట్ ఉందంటూ?