రెడ్డిగూడెంలో విషాదఛాయలు…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: ఓ నిరుపేద కుటుంబానికి తీరని కష్టం ఏర్పడిందని గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమైన విషాద సంఘటన జిల్లాలోని రెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రేట్నేని జానయ్య,భద్రమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు నరేశ్(36) అందరూ వివాహితులే.
జానయ్య భార్య భద్రమ్మ పదేళ్లుగా క్యాన్సర్ తో బ్రతుకు పోరాటం చేస్తున్నది.
ఆమె చికిత్స కోసం ఉన్న ఒక్క ఎకరం భూమి తల్లికోసం అమ్మేశారు.కుమారుడు నరేశ్ (36)కు కొత్తగూడెం గ్రామానికి చెందిన స్వప్న (32)తో వివాహం చేశారు.
జానయ్య భద్రమ్మ గ్రామంలోనే ఉంటూ అంత్యోదయ కార్డుతో జీవిస్తున్నారు.ఇంత కష్టంలో ఉన్న కుటుంబానికి మరో పెద్ద కష్టం వచ్చిపడింది.
నరేష్ తన తల్లిదండ్రులను కాపాడుకుంటూ తన భార్య ఇద్దరు కుమారులతో బ్రతుకుదేరువుకోసం హైదరాబాద్ లోని కుషాయిగూడలోని ట్రావెల్ గూడ్స్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు.
శనివారం అర్ధరాత్రి ఘాడనిద్రలో ఉన్న సమయంలో పక్కనేఉన్న టింబర్ డిపోకు నిప్పు అంటుకోవడంతో రెండో అంతస్తులో ఉన్న నరేష్, స్వప్న,జశ్విత్ (5) మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులు,అనాథగా మారిన పెద్ద కుమారుడు హాత్విక్ (7) కంటికి పుట్టెడు ఏడుస్తూ అమ్మా నాన్నా అని బాబు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు
గ్రామస్తులను, బంధువులను కంట తడి పెట్టిస్తుంది.
దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!