త్యాగాలు తప్పవంటున్న వెంకటరెడ్డి!

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో సీనియర్ మోస్ట్ నాయకుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) కాంగ్రెస్ చాలా బొల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు .

కాంగ్రెస్ నాయకత్వం విషయం లో టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy )తో నిరసన పోటీపడే వెంకటరెడ్డి ఇప్పుడు తన సీటును త్యాగం చేస్తానంటూ భారీ ఆఫర్ ఇచ్చారు.

కాంగ్రెస్కు కొత్త కళ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆశావహుల పోటీ తీవ్రంగా ఉన్నందున రాష్ట్రస్థాయిలో సీనియర్ నాయకులు త్యాగాలకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

తన నియోజకవర్గంలోనే ఆరుగురు అభ్యర్థులు పోటీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ దానిపై నిలబడాలి అంటే అర్హత కలిగిన సమర్థత కలిగిన బీసీ నాయకులకు పోటీకి అవకాశం ఇవ్వాలని ఒకవేళ ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వాల్సి వస్తే తన అసెంబ్లీ సీటును కూడా త్యాగం చేస్తానంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.

"""/" / అయితే చాలా వ్యూహాత్మకంగానే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది.

ముఖ్యంగా చాలా నియోజకవర్గాలలో సీనియర్లకు సరైన గెలుపు అవకాశాలు లేవని వార్తలు వస్తున్నప్పటికీ ఆయా స్థానాల్లో పోటీకి మొండిగా సిద్ధమవుతున్న కొంతమంది అభ్యర్థులకు సంకేతాలు ఇవ్వడానికే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలని అంతిమంగా కాంగ్రెస్ గెలుపే( Congress Party ) లక్ష్యంగా సీనియర్ నాయకులు బావించాలని , ప్రస్తుతం కాంగ్రెస్కు పరిస్థితి అనుకూలంగా ఉన్నందున సీట్లు త్యాగం చేసైనా సరే కాంగ్రెస్కు అధికారం తీసుకురావాలన్న సంకేతాలు ఇవ్వడానికే వెంకటరెడ్డి ఇలా మాట్లాడినట్లుగా తెలుస్తుంది.

తనతోనే మొదలు పెడితే ఇంక ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఉండదని ఆయన ఈ విధంగా మాట్లాడారంటూ కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

"""/" / మరి చాలాకాలం తర్వాత కాంగ్రెస్కు సీట్ల కు విపరీతమైన పోటీ ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్కు కూడా సీట్ల లొల్లి తప్పేలా కనిపించడం లేదు.

ముఖ్యంగా చాలా చోట్ల సీనియర్ అభ్యర్థులను సైతం తోసిరాజని చాలామంది ఆశావహులు పోటీ కోసం దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం .

మరి ఇలాంటి పరిస్థితులను కాంగ్రెస్ హై కమాండ్ ఒక కొలికి ఎలా తీసుకొస్తుందో చూడాలి.

ఢిల్లీలో కేటీఆర్ హరీష్ బిజి… కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు