సచిన్‌ వీరాభిమాని సుధీర్ కి జలక్.. పోలీసులు అలా చేస్తారని అనుకోలేదు..!

భారత్‌ ఆడే ప్రతి క్రికెట్‌ మ్యాచ్‌కు చేతిలో త్రివర్ణ పతాకాన్ని, ముఖంపై సచిన్‌ అని రాసుకొని అలరించే ఓ వ్యక్తి కనపిస్తూ ఉంటాడు.

అతడే సచిన్‌ వీరాభిమాని సుధీర్‌ కుమార్‌ చౌదరి.సచిన్‌ రిటైర్మెంట్‌ అనంతరం కూడా సుధీర్‌ భారత్‌ ఆడే మ్యాచ్‌ల్లో పాల్గొని ఆటగాళ్లను, అభిమానులను ఉత్సహపరుస్తూనే ఉన్నాడు.

అయితే కరోనా కారణంగా క్రికెట్ గ్రౌండ్ కి దూరంగా ఉన్న సుధీర్.ఇప్పుడు విచిత్రక పరిస్థితుల్లో వార్తల్లోకెక్కాడు.

ల్యాండ్ వివాదంలో సచిన్ అభిమాని సుధీర్ కజిన్ బ్రదర్ కిషన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన కజీన్ బ్రదర్ కోసం గురువారం బిహార్‌లోని ముజాఫ్ఫర్‌పుర్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్‌ కి వెళ్లిన తనను పోలీసులు చితక్కొట్టారని సుధీర్ ఆరోపించాడు.

ఈ ఘటనపై ఉన్నత అధికారులకు కూడా ఫిర్యాదు చేసాడట.అయితే, సెలెబ్రిటీ హోదాలో వెళ్లి ఏ పోలీస్ స్టేషన్‌ను అయితే ప్రారంభించాడో.

అదే స్టేషన్‌లో సుధీర్ దెబ్బలు తిన్నాను అని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం.

"""/"/ గత కొన్ని సంవత్సరాల క్రితం నేను సెలెబ్రిటీ హోదాలో వచ్చి ప్రారంభించిన పోలీస్ స్టేషన్‌ లోనే ఇప్పుడు నాకు అవమానం జరిగింది.

పోలీసులు నా మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి చేయి కూడా చేసుకున్నారు.నాపట్లనే పోలీసులు ఇలా ప్రవర్తిస్తే.

ఇక సామన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.' అంటూ సుధీర్ అని తనకు ఫిర్యాదు చేసాడని డీసీపీ రామ్‌నరేశ్ పస్వాన్‌ పేర్కొన్నాడు.

సుధీర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.పోలీస్ స్టేషన్‌ లో సుధీర్ తన కజిన్ కి కలవడం తప్ప ఇంకేం జరగలేదని స్థానిక వర్గాల సమాచారం.

ఈ ఘటనపై డీఎస్పి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

నేను పిల్లల్ని కనకపోవడానికి అసలు కారణాలివే.. వరుణ్ సందేశ్ భార్య కామెంట్స్ వైరల్!