వైరల్ వీడియో: నడవలేని స్థితిలో సచిన్ క్లోజ్ ఫ్రెండ్..

వినోద్ కాంబ్లీ( Vinod Kambli ).క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు ఈయన గురించి కచ్చితంగా తెలుసుకునే ఉంటారు.

క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ కు ఈయన బెస్ట్ ఫ్రెండ్.అంతేకాదు వీరిద్దరూ టీమిండియాకు ఆడిన స్నేహితులు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుండే వీరిద్దరూ మంచి స్నేహితులు.ఇదివరకు తన బ్యాట్తో ఫోర్లు, సిక్సర్లు కొట్టిన వినోద్ కాంబ్లీ నేడు రోడ్డుపై చూడలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడు.

మొదట ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. """/" / అది కూడా ఎంతలా అంటే.

తనకు తాను ఇంకా నడవలేక పోవడమంత.అవును మీరు విన్నది నిజమే.

తాజాగా అతడు రోడ్డుపై అడుగులు తడబడి కింద పడే సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఆయనకు ఆసరా ఇవ్వడంతో కింద పడకుండా ఆపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతుంది.

ఇక ఈ వైరల్ వీడియో గమనించినట్లయితే.నిజానికి ఆయనకు ఏమి జరిగిందని విషయంపై ఖచ్చితమైన సమాచారం ఇంకా తెలియరాలేదు.

ఇకపోతే., వీడియోలో గమనించినట్లయితే వినోద్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిందని అర్థమవుతోంది.

ఇప్పటికే అనేకమార్లు ఆయన ఆస్పత్రిలో చేరాడు. """/" / ఇదివరకు గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరాడు.

ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి మందుకు బానిస అయ్యారు.ఇకపోతే కొద్ది రోజుల క్రితం వినోద్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు తన స్నేహితుడు సచిన్ సహాయం చేయడంతో గట్టెక్కాడు.

అంత కాదు సచిన్ ఆయనను ఓ అకాడమీలో కోచ్ గా నియమించాడు.దీంతోపాటు ముంబై టీ20 లీగ్( Mumbai T20 League ) లో ఓ జట్టుకు కోచ్ కూడా వ్యవహరించాడు.

అయితే అతనికి అనారోగ్యం ఎక్కువ అవడంతో కోచ్ గా కూడా ఉద్యోగం కోల్పోయాడు.

ఇకపోతే వినోద్ కాంబ్లీ., టీమిండియా తరఫున 17 టెస్ట్ మ్యాచ్లు, 104 వన్డేలు ఆడారు.

టెస్టుల్లో వినోద్ 1084 పరుగులు చేయగా.వన్డేలలో 2477 పరుగులు చేశాడు.

ఇకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వినోద్ 9965 పరుగులు చేశాడు.

కేసిఆర్ హరీష్ కు కోర్టు నోటీసులు.. ఎందుకంటే ?