ధోనీని కెప్టెన్ చేయమని సలహా ఇచ్చింది అతడే.. బీసీసీఐ సెక్రటరీ జైషా..!
TeluguStop.com
క్రికెట్ అంటే గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ.
అయితే భారత జట్టుకు కెప్టెన్ గా ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించింది మహేంద్రసింగ్ ధోని( Mahendrasingh Dhoni ) అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కెప్టెన్సీ చేపట్టిన తొలి ప్రయత్నంలోనే భారత్ ని విజేతగా నిలిపించాడు మహేంద్రసింగ్ ధోని.
తన కెప్టెన్సీ తో అసాధ్యాలను కూడా సుసాధ్యాలుగా మార్చాడు.భారత జట్టుకు మర్చిపోలేని విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ చేయమని సలహా ఇచ్చింది ఎవరో బీసీసీఐ సెక్రటరీ జైషా( BCCI Secretary Jay Shah ) తాజాగా బయటపెట్టేశాడు.
"""/" /
భారత క్రికెట్ జట్టుకు మహేంద్రసింగ్ ధోని చాలా పర్ఫెక్ట్ అని ధోనీ పేరును సూచించింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.
( Sachin Tendulkar ) వాఖండే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ విషయాన్ని వెల్లడించారు.
తాను బోర్డు సభ్యునిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో సచిన్ తో చాలాసార్లు చర్చించినట్లు జైషా చెప్పుకొచ్చాడు.
మహేంద్రసింగ్ ధోని 2004 డిసెంబర్ లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు.అయితే భారత జట్టు 2007లో పరాజయం అయింది.
ఆ తర్వాత భారత జట్టుకు ఎవరిని కెప్టెన్( Team India Captain ) చేయాలనే సందిగ్ధంలో బీసీసీఐ ఉండగా ధోని పేరును సచిన్ ప్రకటించాడు.
"""/" /
భారత జట్టులో ధోని కంటే సీనియర్ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ ఉండగా అనుభవం లేని మహేంద్రసింగ్ ధోని భారత జట్టుకు కెప్టెన్ గా నియమించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
చాలామంది ఇది తప్పుడు నిర్ణయం, ఎన్నో విమర్శలు బీసీసీఐ( BCCI ) ఎదుర్కోవలసి వస్తుందని చెప్పడం కూడా జరిగింది.
కానీ మహేంద్రసింగ్ ధోని ఇండియాలోనే బెస్ట్ కెప్టెన్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
భారత జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాలను అందించాడు.నిజంగా మహేంద్రసింగ్ ధోని లో సచిన్ టెండూల్కర్ ఏం గమనించాడో తెలియదు కానీ భారత జట్టుకు ఒక గొప్ప కెప్టెన్ ను సూచించాడు.
భారతీయ పాటకు దీపావళి వేళ అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టిన అమెరికన్ అంబాసిడర్