వైరల్ వీడియో.. ఇందుకే కాదయ్యా నిన్ను ‘క్రికెట్ దేవుడు’ అనింది!

క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్ పేరు ఏదైనా.క్రికెట్ గురించి తెలిసినవారు సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) బ్యాటింగ్‌ను ఇష్టపడని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

అద్భుతమైన షాట్లతో స్టేడియం నలువైపుల బంతిని తరలించగలిగే సత్తా కలిగిన బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్‌ ముందుంటాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్మెంట్ ప్రకటించే వరకు అతను క్రీజులో ఉన్నాడంటే అభిమానులు టీవీలకు అతుక్కుపోయేవారు.

సచిన్ అవుట్ అయితే చాలు, ప్రత్యర్థి జట్టు విజయం సాధించినట్లే అనే పరిస్థితి చాలాకాలం ఉండేది.

"""/" / సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ సచిన్ బ్యాటింగ్‌ను( Sachin Batting ) చూడటం అభిమానులకు అదృష్టంగా మారింది.

తాజాగా సచిన్ మరోసారి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు.ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌ టీ20లో( International Masters League T20 ) సచిన్ టెండూల్కర్ ఇండియా మాస్టర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

మంగళవారం రాత్రి నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఇంగ్లాండ్ మాస్టర్స్( England Masters ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించాడు.

వరుసగా 6, 4, 4 కొట్టి అభిమానులకు కనువిందు చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"""/" / ఇక మ్యాచ్ మొత్తానికి సచిన్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్( India Masters ) జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్టును ఓడించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్టు 132 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇండియా మాస్టర్స్ బ్యాటర్లు బరిలోకి దిగారు.సచిన్ 21 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.

తన ప్రత్యేకమైన స్ట్రోక్స్‌తో అలరించిన సచిన్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.

గుర్ కీరత్ (నాటౌట్) 35 బంతుల్లో 63 పరుగులు, యువరాజ్ (నాటౌట్) 14 బంతుల్లో 27 పరుగులు చేశారు.

ఫలితంగా 11.4 ఓవర్లలోనే ఇండియా మాస్టర్స్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.

సచిన్ బ్యాటింగ్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.అభిమానులు మళ్లీ ఆయన బ్యాటింగ్‌ను చూసే అవకాశం రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు.

51 ఏళ్ల వయస్సులోనూ తన ఆటలో నైపుణ్యాలు ఏమాత్రం తగ్గుదల లేదని మరోసారి నిరూపించిన సచిన్, క్రికెట్ అభిమానులకు మరింత జ్ఞాపకాల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.