శ్రీశాంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్ టెండూల్కర్..

కొద్ది రోజుల క్రితం టీమిండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తాజాగా శ్రీశాంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శ్రీశాంత్‌ను ప్రతిభ ఉన్న బౌలర్‌గానే తాను ఎల్లప్పుడూ ట్రీట్ చేశానని సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు.

టీమిండియాకు శ్రీశాంత్‌ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.‘శ్రీశాంత్‌, నిన్ను నేను ఎంతో టాలెంట్ ఉన్న బౌలర్‌గానే ఎప్పుడూ చూశాను.

కొన్నేళ్ల పాటు క్రికెట్ జట్టుకు నీవు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, కంగ్రాట్స్‌.

నీ రెండో ఇన్నింగ్స్‌కు ఆల్‌ ది వెరీ బెస్ట్‌’ అంటూ సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టి మరీ స్పెషల్ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు.

"""/"/ శ్రీశాంత్‌ 2005 నుంచి 2011 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

భారత్ గెలిచిన 2007 టీ20 వరల్డ్ కప్‌, 2011 వన్డే వరల్డ్ కప్‌ జట్లలో శ్రీశాంత్ ఒక ప్లేయర్ గా ఉన్నాడు.

అయితే, అతడు 2013లో ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ చేశాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఆరోపణల్లో అతను దోషి అని నిర్ధారణ అయ్యింది.దీంతో బీసీసీఐ అతడిపై జీవితకాలం నిషేధం విధించింది.

అప్పటినుంచి టీమిండియా తరఫున అతడు ఆడిన దాఖలాలు లేవు.జీవితకాల నిషేధం సరైంది కాదని శ్రీశాంత్ న్యాయపోరాటం కూడా చేశాడు.

దీంతో కోర్టు 2019 ఆగస్టులో అతడిపై విధించిన లైఫ్ బ్యాన్ ని ఏడేళ్లకు కుదించింది.

ఈమధ్యే అతడి లైఫ్ టైం బ్యాన్ కాలం కూడా తీరిపోయింది.అనంతరం అతను ఐపీఎల్ లో కూడా ఆడదామని అనుకున్నాడు కానీ ఏ జట్టు అతడిని కొనుగోలు చేయలేదు.

తల్లి కావాలనే కోరిక ఉంది… సంచలన వ్యాఖ్యలు చేసిన శోభిత ధూళిపాళ్ల!