అతనిలా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్ తినాలో అంటున్న సచిన్!
TeluguStop.com
టీమిండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్ సేఫ్టీ టి20 సిరీస్ లో క్రికెట్ ఆడుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లో తన ఆట శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం రోడ్ సేఫ్టీ టి20 సిరీస్ లో ఇండియా లెజెండ్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
సచిన్ సారథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడిన ఇండియా లెజెండ్స్ ఒక మ్యాచ్ లో ఓటమి పాలుకాగ మరొక మ్యాచ్ లో విజయం సాధించారు.
తాజాగా సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ లెజెండ్స్ ఆటగాడు క్రిస్ ట్రెమ్లెట్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఫోటో దిగారు.
ఆ ఫోటోను ట్రెమ్లెట్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ."ప్రస్తుతం నేను ఎంతో ఫిట్ గా ఉన్నాను.
సచిన్ టెండుల్కర్ వయసుకు వచ్చేసరికి అతనిలా ఫిట్ గా ఉంటే ఇంకా సంతోషిస్తా"అంటూ క్యాప్షన్ పెట్టారు.
అయితే ట్రెమ్లెట్ ఫోటోను చూసి రీట్వీట్ చేస్తూ సచిన్ టెండూల్కర్ వినూత్న రీతిలో కామెంట్ చేశాడు.
సచిన్ ట్రెమ్లెట్ ఫిజిక్‌ను పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.''ట్రెమ్లెట్.
నేను నీలాగా ఉండాలంటే రోజుకు ఎన్ని ఆమ్లెట్స్ తినాలి?"అంటూ ఎమోజీలను జత చేశాడు.
ట్రెమ్లెట్ చేసిన ట్వీట్ కి సచిన్ రీట్వీట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. """/"/
ఇండియన్ లెజెండ్స్ ఆటగాడు ట్రెమ్లెట్ ఆరడుగుల ఏడు అంగుళాల పొడుగు ఉంటాడు అతను తన శరీర ఫిట్ నెస్ కాపాడుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు.
తన శరీర ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం ట్రెమ్లెట్ ప్రతిరోజు ఎనిమిది వేల కేలరీల ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుని తన శరీర ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్నాడు.
ప్రస్తుతం సచిన్,ట్రెమ్లెట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!