Sachin Tedulkar : సచిన్ క్రేజ్ లో చేసిన ఈ అద్భుతం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే !

కొన్ని అద్భుతాలు ఎలా జరుగుతాయో తెలియదు కానీ అవి చెప్పే వరకు కూడా ఎవరు గుర్తించరు.

తీరా తెలిశాక ఇది మనం ఎలా మిస్ అయ్యాం అబ్బా అని అనుకుంటారు.

అది కూడా కోట్లాది మంది ప్రజలు చూస్తున్న ఒక క్రికెట్( Cricket ) మ్యాచులో జరిగి, అది కూడా ఎవరికి తెలియక పోతే, కొన్నాళ్లకు అది పలానా క్రికెటర్ చెప్పి అప్పుడు అది చూసి జనాలు నోరెళ్ళబెట్టల్సిందే.

అసలు విషయం ఏంటి అంటే క్రికెట్ దేవుడు సచిన్ టెడూల్కర్( Sachin Tedulkar ) క్రికెట్ ఆడుతున్న సమయం లో జరిగిన ఒక అద్బుతం గురించి ఆయన క్రికెట్ మానేసాక ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

"""/" / న్యూజిలాండ్ తో ఇండియా క్రికెట్ ఆడుతున్న మ్యాచ్ లో రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ) తో పాటు సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

అయితే ఆ టైంలో బాల్ రివర్స్ లో స్వింగ్ అవుతూ ఇండియన్ బ్యాట్స్ మెన్ నీ వీర బాదుడు బాదుతున్న సమయం అది.

క్రిస్ కేయిన్స్( Chris Caines ) దాదాపు అందరినీ తన రివర్స్ స్వింగ్ తో ఒక ఆట ఆడుతున్నాడు.

బాల్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న రాహుల్ ద్రావిడ్ సచిన్ రాహుల్ తో ఒక మాట చెప్పాడు.

రాహుల్ నేను బౌలర్ కి దగ్గరగా ఉన్నాను.క్రిస్ కెయిన్స్ బాల్ విసరడానికి ముందు నేను బౌలర్ ని గమనిస్తను.

బాల్ ఎటు వైపు రఫ్ గా ఉంది, ఎటు వైపు బాల్ మెరుస్తుంది అని, దాన్ని బట్టి బాల్ ని ఎదుర్కోవాలో అర్దం అవుతుంది.

"""/" / ఒక వేళ మెరుస్తున్న సైడ్ నుంచి బాల్ రివర్స్ స్వింగ్ లవ్ బౌలర్ వేస్తున్నట్టు అయితే నా బ్యాట్ రైట్ చేతిలోకి తీసుకుంటాను, ఒక వేళ ఔట్ స్వింగ్ వెస్తున్నట్టయితే బ్యాట్ ఎడమ చేతి లోకి తీసుకుంటాను అని చెప్పాడు.

అదే తన క్రికెట్ జీవితంలో మొదటి సారి మరియు ఆఖరి సారి ఒక బ్యాట్స్ మెన్ బౌలర్ బాల్ వేస్తుంటే బౌలర్ ని కాకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ని చూడటం.

అలాంటి ఘటన మళ్ళీ ఎప్పుడు పునరావృతం కాలేదు అని సచిన్ తెలిపారు.అలా సచిన్ రాహుల్ కి చెప్పడం వల్లనే ఆ టైం లో కొన్ని కవర్ డ్రైవ్స్ బౌండరీ లు బాదాడు.

ఆ టైం లో క్రిస్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

ఇక అప్పుడు క్రిస్ తన బౌలింగ్ లైన్ మిస్ అయ్యాడు.ఇక ఏం వేయాలో అర్దం కాక క్రాస్ స్వింగ్ వేయడం మొదలు పెట్టాడు.

అయితే ఆ టైం లో కూడా సచిన్ రాహుల్ కి ఇంస్ట్రక్షన్ ఇచ్చి పెట్టాడట.

బాల్ క్రాస్ లో వస్తె బ్యాట్ మిడిల్ లో హోల్డ్ చేస్తాను అని.

నిజంగా ఇలాంటి కొన్ని అద్భుతాలు ఖచ్చితంగా మ్యాచ్ రీప్లే వేసి చూస్తే తప్ప అర్దం కాదు.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?