అప్పట్లో ఆలయంలోకి మహిళల అనుమతి, మద్యలో బ్యాన్‌.. శబరిమల అయ్యప్ప అసలు విషయాలు ఇదిగో

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 60 యేళ్ళ లోపు మహిళల ప్రవేశం గురించి దాదాపు నాలుగు నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే.

శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.కాని భక్తులు వారిని అడ్డుకుంటూ వస్తున్నారు.

భక్తులు అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం మరియు పోలీసులు భారీ భద్రత మద్య తాజాగా ఇద్దరు మహిళలను అయ్యప్ప దర్శనంకు తీసుకు వెళ్లి దర్శనం చేయించారు.

అయ్యప్ప దర్శనం చేసుకున్న మహిళలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సమయంలోనే ఆలయంకు చెందిన గత వివరాలు వైరల్‌ అవుతున్నాయి.

అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు వెళ్లకూడదు అంటూ నిబందన మొదటి నుండి ఏమీ లేదని, 1991లో కేరళ హైకోర్టు శబరిమలకు మహిళలు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది.

అప్పటి నుండే శబరిమల అయ్యప్ప వద్దకు మహిళలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.అయితే అంతకు ముందు అక్కడ ఒక మలయాళ సినిమా చిత్రీకరణ షూటింగ్‌ జరిగింది.

ఆ చిత్రీకరణ సమయంలో హీరోయిన్‌ గుడి 18 మెట్లు ఎక్కడం, ఆమె అక్కడ ఉండి పాట పాడటం అవన్ని చూపించారు.

ఆ తర్వాత కూడా ఒక కన్నడ హీరోయిన్‌ తాను శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

శబరిమలలో 80 మరియు 90 లలో ఎంతో మంది మహిళలు దర్శించుకున్నారు.కేరళను అప్పట్లో పరిపాలించిన ట్రావెన్‌ కోర్‌ సంస్థానం వారు కూడా మహిళలకు అనుమతించేవారట.

ట్రావెన్‌ కోర్‌ మహారాణి వారు అయ్యప్ప దేవాలయంను సందర్శించుకునే వారట.అప్పట్లో పిల్లలకు సంబంధించిన పూజలు మరియు అన్నప్రాసనలు సకుటుంబ సమేతంగా జరిపించేవారట.

అయితే 200 ఏళ్ల క్రితం మాత్రం ఆలయంలోకి మహిళలను అనుమతించేవారు కాదని అప్పట్లో బ్రిటీష్‌ వారు ఒక సర్వేలో చెప్పారు.

దాంతో ఆ సర్వేను పరిగణలోకి తీసుకుని 1991లో కేరళ హైకోర్టు భక్తుల కోరిక మేరకు మహిళలు అయ్యప్ప సన్నిదానంలోకి అడుగు పెట్టకుండా తీర్పు ఇచ్చింది.

"""/" / కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరిగా లేదని, సరైన ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాలు అంటూ మహిళలను చిన్న చూపు చూడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

అప్పట్లో మహిళలు వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు వెళ్లడంలో తప్పేముంది అంటూ కొందరు ప్రశ్నించారు.

దాంతో సుప్రీం కోర్టు అయ్యప్ప దర్శనం అందరికి అంటూ తీర్పు ఇచ్చింది.అయితే ఆ తీర్పు అమలుకు కేరళ వాసులు ఒప్పుకోలేదు.

కాని నిన్న చరిత్ర పునరావృతం అయ్యింది.సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ అయ్యప్ప సన్నిదానంలోకి మహిళలు ప్రవేశించారు.

ఇది కొనసాగేనా లేదంటే దేవస్థానం బోర్డ మరింత కట్టుదిట్టం చేసి మహిళలను రాకుండా చేసేనా చూడాలి.