భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల..!
TeluguStop.com

కేరళ రాష్ట్రంలోని శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది.రోజుకు సుమారు లక్ష మందికి పైగా అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు.


ఈ క్రమంలోనే స్వామివారి దర్శనార్థం గంటల కొద్దీ భక్తులు ఎదురు చూస్తున్నారు.సుమారు 20 గంటల పాటు ఎదురు చూసినా దర్శనం లభించడం లేదని తెలుస్తోంది.


ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కొందరు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.మరోవైపు శబరిమల చేరేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శబరిమలకు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జామ్ కాగా సుమారు ఐదు రోజులుగా వాహనాలు బారులు తీరాయని తెలుస్తోంది.
అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్.. ఆ తప్పులు చేయనంటూ?