రైతురాజ్యం కేసీఆర్ తోనే సాధ్యం : మండల రైతుబందు సమితి అధ్యక్షుడు చెరుకుపల్లి రాజిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: మానకొండూర్ ఎమ్మెల్యే గా రసమయి బాలకిషన్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని, కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతులు పంట చేలల్లోనే ఆత్మహత్యలు చేసుకున్నారని, రాత్రి కరెంటు కు రైతులు ప్రమాదాలకు గురయ్యారని, సాగు నీళ్లు లేక రైతులు భూములు పడావుబెట్టి గల్ఫ్, హైదరాబాద్,బీవండి,ముంబాయి వెళ్లి కిటుంబాలను పోషించుకున్న దుర్భరమైన దుస్థితి ఉండేదని ఇల్లంతకుంట మండల రైతుబందు సమితి అధ్యక్షుడు చెరుకుపెళ్లి రాజిరెడ్డి అన్నారు.

ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు,ఊర్లను వదిలి వలసలు పోవద్దనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నెర్రెలు భారిన భీడుభూములకు సాగు నీళ్లు అందించి సీఎం కేసీఆర్ తెలంగాణ లో రైతురాజ్యం తీసుకువచ్చారని పేర్కొన్నారు.

రైతులు పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు చేయొద్దనే లక్ష్యంతో రైతుబందు పథకం ద్వారా ఎకరాకు పది వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారని.

రైతులకు మరింత అండగా ఉండాలనే లక్ష్యంతో ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబందు సాయాన్ని పదహారు వేలకు పెంచి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతులు ఏ కారణంతో మరణించిన కూడా రైతు కుటుంబాలు రోడ్డున పడొద్దనే లక్ష్యంతో రైతుభీమా పథకం ద్వారా ఐదు లక్షల సాయం కూడా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగిందని, ఇంకా రైతు రుణమాఫీ కానీ రైతుల ఖాతాల్లో నవంబర్ 25 వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ సొమ్ము జమచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

యాభై ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ రైతులను పట్టించుకోలేదని, రైతులపై కాంగ్రెస్ సవతితల్లి ప్రేమ చూపుతుందని అన్నారు.

మానకొండూర్ ఎమ్మెల్యే గా మూడవ సారి కూడా రసమయి బాలకిషన్ ను రైతులు, ప్రజలందరూ అఖండ మెజారిటీ తో గెలిపించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, భారాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమా మాకు సెట్ కాదు..దర్శకుల ముఖం పైన చెప్పేసిన స్టార్ హీరోలు..?