ఆరెక్స్ 100 సినిమాతో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ అజయ్ భూపతి.
అయితే సెకండ్ సినిమా మహా సముద్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా తీయగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.
ఇక ఇప్పుడు థర్డ్ సినిమాపై కసరత్తులు చేస్తున్నాడు అజయ్ భూపతి.ఈ క్రమంలో అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా మళ్లీ ఆరెక్స్ 100 కాంబోలో చేస్తున్నాడని తెలుస్తుంది.
కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఆల్రెడీ ఒక సూపర్ హిట్ కొట్టిన కాంబినేషన్ కాబట్టి తప్పకుండా ఈ కాంబో రిపీట్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది.
కార్తికేయ కూడా వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని సరైన హిట్టు మాత్రం దక్కట్లేదు.
రీసెంట్ గా రాజా విక్రమార్క సినిమా వచ్చింది.ఆ సినిమా కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది.
అందుకే మరోసారి ఆరెక్స్ 100 డైరక్టర్ తో సినిమా తీసి సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు కార్తికేయ.
కార్తికేయ కెరియర్ ప్లానింగ్ బాగానే ఉన్నా కథల విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాలని చెప్పొచ్చు.
ఎన్ని సినిమాలు చేస్తున్నాం అన్నది లెక్క కాకుండా ప్రేక్షకులను మెప్పించే సినిమా చేస్తున్నామ లేదా అన్నది చూసుకోవాలి.