కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్..!

తాజాగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( Australia ) మధ్య జరిగిన నాలుగవ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ లో ఆడాల్సిన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే భారత జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు చేసిన భారత జట్టు బ్యాటర్ గా నిలిచాడు.

తాజాగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన నాలుగవ టీ20 మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) 32 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు.

116 ఇన్నింగ్స్ లలో రుతురాజ్ గైక్వాడ్ 4 వేల పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు.

కేఎల్ రాహుల్ భారత్ తరపున 117 ఇన్నింగ్స్ లలో 4 వేల పరుగులు చేసిన భారత రెండవ బ్యాటర్ గా నిలిచాడు.

"""/" / అంతర్జాతీయ పరంగా చూస్తే.టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 4 వేల పరుగులు చేసిన బ్యాటర్లలో వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ ( Chris Gayle )అగ్రస్థానంలో ఉన్నాడు.

గేల్ 107 ఇన్నింగ్స్ లలో 4వేల పరుగులు చేశాడు. """/" / కాగా, తాజాగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి, 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసి సిరీస్ కోల్పోయింది.

భారత్ 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది.

ఈ సిరీస్ లో ఐదవ మ్యాచ్ డిసెంబర్ మూడవ తేదీ బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగునుంది.

వీడియో: హుండీ విరాళాలు లెక్కపెడుతూనే నోట్ల కట్టలు కాజేశారుగా..