ఇండియాకు రష్యా వ్యాక్సిన్…?!

ఇండియాకు రష్యా వ్యాక్సిన్…?!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.ఇప్పటికే పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ ను కనుగొని క్లినికల్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశారు.

ఇండియాకు రష్యా వ్యాక్సిన్…?!

ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు కూడా చేరుకున్నాయి.అయితే ప్రపంచంలో మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకొచ్చినట్లు ఆగస్టు 12వ తేదీన రష్యా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇండియాకు రష్యా వ్యాక్సిన్…?!

అయితే వాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ విషయాలపై ఎలాంటి విషయాలు వెల్లడించకపోవడంతో ప్రపంచ దేశాలను విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో రష్యా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమైంది.దాదాపు 40 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిసిందే.

వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి డేటాను రష్యా రిలీజ్ చేస్తే వ్యాక్సిన్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, భారత్ తో సంప్రదింపులు జరుపుతోంది.

అయితే భారత్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి డేటాను కోరింది.అయితే దీనికి అంగీకరించిన రష్యా ఇప్పటికే ఇండియాకు డేటాను అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ప్రస్తుతం చర్చలు చివరిదశలో ఉన్నాయని, త్వరలో రష్యా వ్యాక్సిన్ భారత్ కు రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

రష్యా వ్యాక్సిన్ పై ఆరోపణలు రావడంతో అక్కడి ప్రభుత్వం మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి మూడోదశ ట్రయల్స్ కు సిద్ధమైంది.

ఈ మేరకు 40 వేల మందిపై ట్రయల్స్ నిర్వహిస్తోంది.ఈ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే త్వరలోనే మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్ రానుంది.

అయితే ఇండియాలో కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.సెప్టెంబర్ నుంచి ఆక్టోబర్ వరకు కరోనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి రానుందని ఇప్పటికే కొన్ని ఫార్మాకంపెనీలు వెల్లడించాయి.

ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు.. బాధేస్తుంది.. శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్!

ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు.. బాధేస్తుంది.. శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్!