భారతదేశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు…!!
TeluguStop.com
ప్రపంచంలో భారతదేశానికి నమ్మకమైన మిత్ర దేశం రష్యా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చాలా కీలకమైన సమయాలలో భారత్ కి రష్యా అండగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి.
అటువంటి రష్యా దేశానికి చెందిన అధ్యక్షుడు పుతిన్ భారతదేశంపై ప్రశంసలు వర్షం కురిపించారు.
భారతీయులు ఎంతో ప్రతిభావంతులు.రష్యన్ యూనిటీ డే సందర్భంగా ప్రసంగించిన ఆయన.
అభివృద్ధిలో భారత్ అద్భుత ఫలితాలను సాధించేందుకు భారతీయులకు ఎంతో సత్తా ఉందని తెలిపారు.
భారతదేశ అంతర్గత అభివృద్ధి కోసం.ఎంతోమంది ప్రతిభావంతులు భారతీయులలో ఉన్నారు.
రానున్న రోజులలో అభివృద్ధి విషయంలో భారత్ లో అద్భుత ఫలితాలు వస్తాయి.దాదాపు 150 కోట్ల మంది ప్రజానికం కలిగిన దేశంలో.
ఎంతోమంది ప్రతిభావంతులు దాగి ఉన్నారు అని తెలిపారు. ఇదిలా ఉంటే గతవారం భారతదేశ విదేశాంగ విధానాన్ని పుతిన్ ప్రశంసించారు.
ఇదే సందర్భంలో ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలను కూడా పొగడటం జరిగింది.భవిష్యత్తు భారత్ దే అని.
అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.కాగా తాజాగా రష్యన్ యూనిటీ డే"సందర్భంగా నవంబర్ 4వ తారీఖు భారత్ నీ పుతిన్ మరోసారి పొగడటం అంతర్జాతీయంగా సంచలనం రేపింది.
మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్… గుడ్ న్యూస్ చెప్పిన నటి!