పోలాండ్‎లో రష్యా మిస్సైల్ దాడి.. !

ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులతో యుద్ధం దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ సరిహద్దులో క్షిపణి దాడి జరిగింది.

ఈ మిస్సైల్ రష్యాకు చెందినదిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ దాడిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

మరోవైపు ఇండోనేషియా రాజధాని బాలిలో జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో పోలాండ్ పై మిస్సైల్ దాడి జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఈ దాడితో అప్రమత్తమైన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.

జీ 20 సమావేశం అనంతరం జీ7, నాటో దేశాల నేతలతో ఆయన భేటీ కానున్నారు.

కాగా నాటోలో పోలాండ్ సభ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే.

ఆ ఏరియాలో చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కలెక్షన్లే రాలేదా.. అసలేం జరిగిందంటే?