Bear Playing Harmonica : హార్మోనికా వాయించడం నేర్చుకుంటున్న ఎలుగుబంటి.. వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు…

భారతదేశంలో కుక్కలు, పిల్లులు ఎలా జనావాసాల్లో కనిపిస్తాయో రష్యాలో( Russia ) ఎలుగుబంట్లు అలా తరచుగా కనిపిస్తుంటాయి.

ప్రజలు వీటిని చూసి అస్సలు భయపడరు.అంతేకాదు వాటి ముందు ధైర్యసాహసాలను ప్రత్యేకమైన మార్గాల్లో ప్రదర్శిస్తారు.

ఇంటర్నెట్‌లో ఈ అద్భుతమైన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.ఇప్పటిదాకా మనం కుక్కల నుంచి విన్యాసాలు చేసే పిల్లుల వరకు అనేక వీడియోలను చూసాం.

కొన్ని పెంపుడు జంతువులు అయితే సంగీత వాయిద్యాలను కూడా ప్లే చేస్తూ ఆశ్చర్యపరిచాయి.

ఈ క్లిప్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యానిమల్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.అయితే రష్యాలో కుక్కలు, పిల్లుల కంటే ఎలుగుబంట్లను( Bears ) ఎక్కువగా పెంచుకుంటారు.

వీటికి చాలా స్కిల్స్ కూడా నేర్పిస్తుంటారు.తాజాగా ఒక వ్యక్తి తన పెంపుడు ఎలుగుబంటికి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌ నేర్పిస్తూ ఆశ్చర్యపరిచాడు.

అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. """/" / ఈ వీడియోలో ఎలుగుబంటికి హార్మోనికాను( Harmonica ) ఎలా వాయించాలో నేర్పే ప్రయత్నం చేస్తున్న ఒక రష్యన్ వ్యక్తిని మనం చూడవచ్చు.

ఆ వ్యక్తి, ఎలుగుబంటి ఒక గదిలో ఒకరికొకరు పక్కపక్కన కూర్చున్నారు.మొదటగా వ్యక్తి హార్మోనికా వాయిస్తాడు.

ఎలుగుబంటికి దీనిని ఈ విధంగా ప్లే చేయాలని చెబుతాడు.ఒక క్షణం తర్వాత, అతను ఎలుగుబంటికి వాయిద్యాన్ని అందజేస్తాడు.

మొదట, ఎలుగుబంటి హార్మోనికా చూసి అయోమయంలో పడినట్లు కనిపిస్తుంది, దానితో ఏమి చేయాలో దానికి తెలియదు.

"""/" / కానీ యజమాని కొంత గైడెన్స్, ప్రోత్సాహం అందించడంతో ఎలుగుబంటి దానిని ఎలా అప్లై చేయాలో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది.

ఆపై హార్మోనికాలో ఊదడం ద్వారా శబ్దాలను ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ వీడియోను 'panteleenko_svetlana' హ్యాండిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

వీడియోకు 80 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.ఈ ఎలుగుబంటి చాలా బాగా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తానని చాలామంది కామెంట్ చేశారు.

ఇలాంటి పని చేసిన దానికి ఏదైనా బహుమతి ఇవ్వాలని కోరారు.కొందరు ఎలుగుబంటి చేసిన ఈ పనిని నమ్మలేకపోతున్నారు.

వాళ్లు లేకపోతే అసలు పుష్ప సినిమానే లేదు… అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?