పుతిన్ ఫోన్ వాడరా? ఆయన కొత్త ప్రవర్తనకు కారణం అదేనా?
TeluguStop.com
ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin ) సైనిక చర్య ప్రకటించిన సమయం నుంచి ఆ అధ్యక్షుడు హాట్ టాపిక్ గా మారారు.
అతని గురించి ప్రతి విషయం వెలుగులోకి వచ్చింది.తాజాగా ఇప్పుడు ఈ అత్యంత శక్తివంతుడైన అధ్యక్షుడి గురించి కీలక రహస్యాలను గతంలో రష్యా ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ (FSO)లో కెప్టెన్‌గా పనిచేసిన గ్లెబ్ కారకులోవ్( Gleb Karakulov ) బయటపెట్టారు.
పుతిన్ సీక్రెట్ ట్రైన్ నెట్‌వర్క్‌లోనే ప్రయాణాలు చేస్తారని ప్రపంచంలో ఎవరికీ తెలియని కొత్త విషయాన్ని గ్లెబ్ వెల్లడించారు.
ఈ నెట్‌వర్క్‌ను ఎవరూ ట్రాక్ చేయలేరట.అందుకే పుతిన్ దీనిని ప్రయాణాలకు ఉపయోగిస్తున్నారని కారకులోవ్ వివరించారు.
పుతిన్ ఓ యుద్ధ నేరగాడని, అతనికి చావు అంటే చాలా భయం ఉంటుందని.
అందుకే బంకర్‌లోనూ తల దాచుకుంటారని పేర్కొన్నారు.ఇంకా ఆయన మాట్లాడుతూ పుతిన్ అసలు ఫోన్, ఇంటర్నెట్ వాడరని.
అలాగే కరోనా సమయం నుంచి అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందన్నారు.కరోనా విజృంభణ నుంచి ప్రయాణాలు తగ్గించారని, పబ్లిక్ అప్పీరియన్సెస్ ఇవ్వడం దాదాపు మానేశారన్నారు.
ఎందుకంటే తనకు కరోనా సోకి ఎక్కడ చనిపోతానేమో అని భయపడి అతను ఇలా చేస్తున్నారట.
"""/" /
అంతేకాకుండా పరాయి దేశాల నిఘాకు చిక్కకుండా, వారి మర్డర్ అటెంప్ట్స్‌లో బలికాకుండా పుతిన్ కాన్వాయ్ ఏర్పాటు చేసుకుంటారని తెలిపారు.
అంతేకాదు ఈ అధ్యక్షుడి కోసం విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు, బాంబు షెల్టర్లలో సీక్రెట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్( Secret Communication Systems ) తప్పకుండా ఉంటాయట.
ఇన్ని విషయాలను బయటపెట్టిన గ్లెబ్ ఉక్రెయిన్‌పై దాడిని వ్యతిరేకించే వారిలో ఒకరు. """/" /
విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు పుతిన్ తనతో ఒక టెలిఫోన్ బూత్‌ను వెంట తీసుకువెళతారని, అందులో వర్క్‌స్టేషన్, టెలిఫోన్ ఉంటుందని, దానిని ఉపయోగించి కమ్యూనికేట్ చేస్తారని గ్లెబ్ మరో సీక్రెట్ బహిర్గతం చేశారు.
పుతిన్ ఆరోగ్యంపై కూడా గ్లెబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పుతిన్ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటారని.
ఆయన చాలా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
అట్లీ లుక్ పై కామెంట్లు చేసిన బాలీవుడ్ కమెడియన్.. ఈ బాలీవుడ్ నటుల తీరు మారదా?