Oleg Kononenko : అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యక్తిగా రష్యన్ వ్యోమగామి వరల్డ్ రికార్డ్!
TeluguStop.com

రష్యన్ వ్యోమగామి ఒలేగ్ కోనోనెంకో( Oleg Kononenko ) అంతరిక్షంలో 878 రోజులు సమయం గడిపి వరల్డ్ రికార్డు సృష్టించారు.


ఆయన అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఆదివారం ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.


అంతేకాదు ఆయన మొత్తంగా దాదాపు రెండున్నరేళ్లపాటు అంతరిక్షంలో ఉండనున్నారు. """/" /
కోనోనెంకో వయస్సు 59 సంవత్సరాలు, ఆయన రోస్కోస్మోస్ కాస్మోనాట్స్ నాయకుడు.
రోస్కోస్మోస్ ( Roscosmos )అనేది స్పేస్‌తో వ్యవహరించే ఒక రష్యన్ ఏజెన్సీ.కోనోనెంకో అంతరిక్షంలోకి వెళ్లడం ఇది ఐదోసారి.
ఈ కాస్మోనాట్ సెప్టెంబరు 23న తిరిగి భూమికి రానున్నారు.ఆ సమయం నాటికి 1,110 రోజులు అంతరిక్షంలో ఉన్నట్లు అవుతుంది.
"""/" /
కోనోనెంకో 34 సంవత్సరాల వయస్సులో కాస్మోనాట్‌గా శిక్షణ పొందడం ప్రారంభించారు.
ఆపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ISS ) కార్యక్రమంలో చేరడానికి ఎంపికయ్యారు.
ISS అనేది భూమి చుట్టూ తిరిగే ఒక పెద్ద అంతరిక్ష కేంద్రం.శాస్త్రీయ ప్రయోగాలు, ఆవిష్కరణలపై వివిధ దేశాలు కలిసి పనిచేసే ప్రదేశమిది.
కోనోనెంకో మొదటిసారిగా ఏప్రిల్ 8, 2008న అంతరిక్షంలోకి వెళ్లారు.అతను ISSకి 17వ మిషన్‌లో భాగమయ్యారు.
అక్టోబర్ 24, 2008న భూమికి తిరిగి వచ్చారు.యునైటెడ్ స్టేట్స్, రష్యా( United States, Russia ) ఇప్పటికీ కొన్ని విషయాలలో ఒకే మాటపై ఉంటాయి.
ఆ కొన్ని విషయాలలో ISS ఒకటి.వారు తమ వ్యోమగాములను కలిపి ISSకి పంపే కార్యక్రమాన్ని కలిగి ఉన్నారు.
ఈ కార్యక్రమం 2025 వరకు కొనసాగుతుంది.యునైటెడ్ స్టేట్స్, రష్యా ఇతర ప్రాంతాలలో అంత కలుపుగోలుగా ఉండవు.
2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి వారి మధ్య కాస్త శత్రుత్వం పెరిగిపోయింది.
తిరిగి పోరాడేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపింది.యునైటెడ్ స్టేట్స్ రష్యాను ఆంక్షలతో శిక్షించింది.
రాజేంద్రప్రసాద్ తీరుపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్…. హాస్యం, అపహాస్యానికి తేడా తెలీదా అంటూ!