సైన్యానికి వయాగ్రా ఇచ్చి.. ఉక్రెయిన్ మహిళలను రేప్ చేయమంటున్న రష్యా..

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత ఎనిమిది నెలలుగా కొనసాగుతూనే ఉంది.ఈ యుద్ధంలో ఎన్నో దారుణాలు వెలుగుచూశాయి.

ఉక్రెయిన్ దేశం నుంచి వచ్చిన హృదయవిదారకమైన దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కంటతడి పెట్టించాయి.

బుచా ఊచకోత కూడా అందర్నీ బాగా డిస్టర్బ్ చేసింది.కాగా రోజురోజుకూ రష్యన్ సైనికుల అరాచకాలు మరింత ఎక్కువ అవుతున్నాయి.

ఉక్రెయిన్ పౌరులపై క్రూరమైన చర్యలు చేయాలని రష్యా ప్రభుత్వం తమ సైనికులను పురిగొల్పుతోంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఉక్రేనియన్లపై అత్యాచారం చేయాలని సైనికులను రష్యా ఎంకరేజ్ చేస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

సైనిక వ్యూహంలో భాగంగా ఉక్రేనియన్లపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు రష్యా తన సైనికులకు డ్రగ్స్ అందజేస్తోందని ఐక్యరాజ్యసమితి అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో పౌరులపై అత్యాచారం చేయడానికి సైనికులకు రష్యా వయాగ్రా అందజేస్తోందని అధికారి పేర్కొన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఉక్రెయిన్‌పై యూఎన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక నివేదికను విడుదల చేసింది.

ఈ రిపోర్ట్‌లో రష్యన్ సైనికులు పౌరులపై అత్యాచారం, హింసలు, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలతో సహా క్రూరమైన యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఆ కమిషన్ పేర్కొంది.

"""/"/ యుద్ధం ప్రారంభమైన నుంచి లైంగిక హింస, వేధింపులు ఎక్కువయ్యాయని ఆ రిపోర్ట్ పేర్కొంది.

ఈ హింసలో బాధితులైన వారిలో నాలుగేళ్ల పసిపిల్లల నుంచి 82 ఏళ్ల మహిళలు ఉన్నారని కమిషన్ నమోదు చేసింది.

కాగా రేపుల వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

తెలుగులో నాని తమిళ్లో కార్తీ.. వీరిద్దరిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..!