రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్’.. నెలాఖరులోగా !
TeluguStop.com
ప్రపంచవ్యాప్తం కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
ఈ మేరకు ప్రపంచదేశాలు కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించారు.
అధికారికంగా వ్యాక్సిన్ అందుబాటులోకి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వ్యాక్సిన్ మార్కెట్ లోకి వస్తుందని తెలిపారు.
ఈ తరుణంలో రష్యా కూడా తన వ్యాక్సిక్ ను ఆగస్టు 12న క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
ప్రయోగంపై ఎలాంటి స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆరోపిస్తోంది.ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారీలో బిజీ అయ్యారు.
అయితే రష్యా తాము వ్యాక్సిన్ ని తయారు చేశామని చెప్పడంతో అన్ని దేశాలకు గుడ్ న్యూస్ వినిపించింది.
వ్యాక్సిన్ కు సంబంధించి అధికారికంగా పేరును కూడా రిజిస్టర్ చేయించుకుంది.పేరును ‘స్పుత్నిక్’ గా నామకరణం చేసింది.
ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఇంటర్ ఫాక్స్ వార్తా సంస్థ పేర్కొంది.ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని, వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని రష్యా వెల్లడించింది.
స్పుత్నిక్ వ్యాక్సిన్ ను మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్ లో తయారు చేశారని, వ్యాక్సిన్ కరోనాను నిర్మూలిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.
నాకెప్పుడూ చరణ్ సత్తా మీద డౌట్ లేదు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!