ఎటూ పోయే దారి లేదు.. కీవ్‌లోనే వున్నాం, కాపాడండి: ఉక్రెయిన్‌లోని భారతీయ కుటుంబం మొర

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్రం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి .ఆ దేశ పశ్చిమ సరిహద్దులకు పంపించి.

రొమేనియా, హంగేరి మీదుగా భారత్‌కు తరలిస్తున్నారు.దాదాపు 60 శాతం మంది భారతీయులను ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి తరలించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం తెలిపింది.

బుకారెస్ట్, బుడాపెస్ట్, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్‌లలోని విమానాశ్రయాలను కూడా ఉపయోగించుకుంటున్నామని వెల్లడించింది.ఇంకా 40 శాతం మంది భారతీయులే ఉక్రెయిన్‌లో వున్నారని.

వీరిలో సగం మంది ఖార్కీవ్, సుమీ జోన్‌లో వున్నారని.రాజధాని కీవ్‌లో ఎవరూ లేరని పేర్కొంది.

అయితే నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం ఇంకా కీవ్‌లోనే చిక్కుకుపోయింది.రష్యా భీకర దాడుల నేపథ్యంలో ఎటూ వెళ్లే వీలులేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా గోడు వెల్లబోసుకుంది.

మంగళవారం నాటికి కీవ్‌ను ఖాళీ చేయాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది.

అయితే అప్పటికీ రష్యా దాడి తీవ్రతరం కావడంతో తాము నగరాన్ని విడిచి వెళ్లలేకపోయామని ఈ కుటుంబం పేర్కొంది.

డాక్టర్ రాజ్‌కుమార్ సంతాలానీ, అతని భార్య మోహనందనే, వీరి కుమార్తె జ్ఞానరాజ్ సంతాలానీ, కుమారుడు పార్థ సంతాలానీలు కీవ్‌లో చిక్కుకుపోయారు.

ఈ మేరకు రాజ్‌కుమార్ ఒక వీడియో సందేశంలో తమ కష్టాలను పంచుకున్నారు.ఎంబసీ అధికారులు తమకు పలుమార్లు ఫోన్ చేశారని.

రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామని చెప్పారని, కానీ తమకు అటు నుంచి ఎలాంటి సాయం అందలేదని రాజ్‌కుమార్ చెప్పారు.

ఆ తర్వాత తమ వీధిలో కాల్పుల శబ్ధాలు వినిపించాయని ఆయన పేర్కొన్నారు. """/" / రష్యన్ మద్ధతుదారులు వీధుల్లో తిరుగుతున్నందున బాల్కనీలో కాపలాగా వుండాల్సిందిగా తమ పొరుగువారు కోరారని రాజ్‌కుమార్ చెప్పారు.

సైనికుల మధ్య కాల్పులతో పాటు కొందరు ప్రజలను దోచుకుంటున్నారని ఆయన తెలిపారు.ఇక్కడ తమకు హీటర్ లేదని.

చాలా చల్లగా వుందని, తమ కుమారుడు జ్వరంతో బాధపడుతున్నాడని రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

వీలైనంత త్వరగా తమను తరలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అయితే పరిస్ధితుల నేపథ్యంలో కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేసింది.

రాయబారి సహా సిబ్బంది మొత్తం ఉక్రెయిన్ పశ్చిమ భాగానికి చేరుకున్నారు.ఈ క్రమంలోనే కీవ్‌లో భారతీయులెవరూ లేరని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

తాజాగా రాజ్‌కుమార్ వీడియో బయటకు రావడంతో విదేశాంగ శాఖ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

సునీల్ ఒక్కో సినిమాకి ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా.. ఏడాది ఆదాయం ఎంతంటే..??