కిల్లర్ డ్రోన్లతో రష్యాకి షాకిచ్చిన ఉక్రెయిన్.. ఆ వంతెనపై భారీ దాడి..
TeluguStop.com
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రష్యా దాడులను చాలాకాలంగా సమర్థవంతంగా తిప్పి కొడుతున్న ఉక్రెయిన్ లొంగిపోవడానికి ఏమాత్రం మొగ్గు చూపడం లేదు.
అంతేకాదు, ఊహించని దాడులతో రష్యాకి( Russia ) చుక్కలు చూపిస్తోంది.ముఖ్యంగా పడవ డ్రోన్లతో రష్యన్ అధికారులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతోంది.
తాజాగా ఈ దేశం రష్యాను క్రిమియాతో కలిపే క్రిమియా బ్రిడ్జ్ పై( Crimean Bridge ) భారీ దాడులు జరిపింది.
ఈ ఘటనలో అదే వంతెన పై వెళ్తున్న రష్యాకు చెందిన దంపతులు మృతి చెందగా, వారి బిడ్డకు గాయాలయ్యాయి.
"""/" /
వంతెనపై పేలుళ్లు జరిగాయని కొందరు అంటున్నారు, అయితే రష్యా అధికారులు ఈ పని ఉక్రెయిన్ దేశమే చేసి ఉంటుందని ఆరోపించారు.
ఉక్రెయిన్‌లోని రష్యన్ దళాలకు ఈ వంతెన ముఖ్యమైనది.ఉక్రెయిన్‌కి( Ukraine ) వెళ్లి యుద్ధం చేసే క్రెమ్లిన్ దళాలకు కీలకమైన సరఫరా మార్గంగా ఈ వంతెన పనిచేస్తుంది.
దానిలోని ఒక విభాగం కూల్చి వేసిన తర్వాత ఆర్మీ సిబ్బంది రాకపోకలు నిలిచిపోయాయి.
2014లో ఉక్రెయిన్ దేశంలోని క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది.ఆ ప్రాంతానికి సులభంగా చేరుకునేందుకు ఈ కెర్చ్ బ్రిడ్జ్ నిర్మించింది.
ఈ వంతెన కూల్చివేయాలని ప్రత్యర్థి దేశం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. """/" /
ఇకపోతే బెల్గోరోడ్ గవర్నర్ కుటుంబం మరణాలు, గాయాలను ధృవీకరించారు కానీ వారు ఎలా మరణించారో చెప్పలేదు.
వంతెన నిర్దిష్ట పిల్లర్‌పై ఈ సంఘటన జరిగిందని క్రిమియా గవర్నర్ చెప్పారు, అయితే మరిన్ని వివరాలను ఇవ్వలేదు.
రష్యా రవాణా మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ, వంతెనకు నష్టం జరిగిందని, కానీ స్తంభాలకు ఏమీ కాదని చెప్పింది.
వంతెనలో కొంత భాగం విరిగిపోయినట్లు చూపించే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, కానీ అది దాడికి సంబంధించినదా కాదా అనేది అస్పష్టంగా ఉంది.
రష్యా అధ్యక్షుడికి ఈ వంతెన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్.2022లో దీనిపై ఆల్రెడీ ఒకసారి దాడులు జరిగాయి.
దానిని మరమ్మతు చేసిన తర్వాత పుతిన్( Putin ) కారులో దాటారు.
వీడియో వైరల్: ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?