రుషికొండ నిర్మాణాలపై అన్నిరకాల అనుమతులు ఉన్నాయి.. ఆర్కే రోజా

విశాఖపట్నం( Visakhapatnam )లోని రుషికొండ నిర్మాణాలపై అన్నిరకాల అనుమతులు ఉన్నాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా వెల్లడించారు.

రుషి కొండ నిర్మాణాలji సంబంధించి కేంద్ర అటవీశాఖ మార్చి 12, 2021న అనుమతి ఇచ్చిందని, అత్యంత ముఖ్యమైన CRZ పర్మిషన్ను మే 19, 2021న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఆమె తెలిపారు.

ఈ రెండు అనుమతులు వచ్చిన తర్వాతనే స్థానిక ప్రభుత్వ శాఖలు, విభాగాలు మిగిలిన అనుమతులు ఇచ్చాయని ఆమె వెల్లడించారు.

ఫైర్ సేఫ్టీ పర్మిషన్, జీవీఎంసీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌తో పాటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFC (Consent For Establishment)పర్మిషన్‌ కూడా వీటికి ఉందని తెలిపారు.

ఇవన్నీ తీసుకున్న తర్వాతనే 2021 సెప్టెంబరులో చట్టబద్ధంగా ఈ భవనాల నిర్మాణం -ప్రారంభం అయ్యిందన్నారు.

తీసుకోవాల్సిన అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత, రిషికొండ( Rushikonda )లో కడుతున్న బిల్డింగులకు ఎలాంటి పర్మిషన్లు లేవంటూ ప్రతిపక్షాలకు చెందినవారు మాట్లాడ్డం అర్థరహితమన్నారు.

కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి రుషికొండ నిర్మాణాలను వేదికగా చేసుకున్నారన్నారు.

ప్రభుత్వం ఇంత స్పష్టంగా నిబంధనలు పాటిస్తుంటే, ఈ చదువులేనోడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి రోజా అన్నారు.

పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఒక విశ్వాసపాత్రమైన పెంపుడు జంతువు లాంటివాడే తప్ప, ప్రజాసేవకు తగిన మనిషి కాదని వ్యాఖ్యానించారు.

అసలు పవన్‌కళ్యాణ్‌ పార్టీ లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించారు.తమది జగన్ గారి వ్యతిరేక పార్టీ అని చెబుతారు తప్ప, ప్రజలకు ఫలానాది చేయటానికి ఈ పార్టీ పెట్టాం అని సమాధానం చెప్పుకోలేని పరిస్థితి పవన్‌కళ్యాణ్‌దని రోజా అన్నారు.

ఎంత చిన్న పార్టీ అయినా, ఒక ఐడెంటిటీ ఉంటుందని, చంద్రబాబుకు పనిచేయడమే తన ఐడెంటిటీగా పవన్‌భావిస్తున్నారన్నారు.

సీఎం జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, పొత్తులకోసం పాకులాడుతున్నారంటూ విమర్శించారు.

వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని - ముఖ్యమంత్రి జగన్ గారు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే.

విశాఖ ప్రజలపైనా ప్రతిపక్షాలు కక్షకట్టాయని విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసి, ఆ ప్రాంత ప్రజలను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.