నల్లగొండ జిల్లా: అనుముల మండలం చల్మారెడ్డిగూడెంలో పురాతన కాలంలో నిర్మించిన పశువైద్యశాల శిధిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతుందో తెలియక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
అయినా పాలకులు,అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.చిన్నపాటి వర్షానికే పైకప్పు ఊడుతుండడం,గదుల్లోకి వర్షపునీరు అధికంగా రావడంతో వర్షాకాలంలో నానా తంటాలు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా పాలకులు స్పందించి నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు.