అధికారుల తీరుపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి

అధికారుల తీరుపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి మంత్రులు క‌లెక్ట‌ర్లు మారుతున్నారు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేద‌ని ఆవేద‌న‌ క‌లెక్ట‌రేట్ లో జ‌రిగిన అధికారుల సమీక్ష స‌మావేశంలో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఎమ్మెల్యేలు క‌లెక్ట‌ర్‌ స‌మ‌క్షంలో కీల‌క వ్యాఖ్య‌లు.

ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసమే మాట్లాడుతున్నాన‌ని రాజ‌కీయం చేయొద్ద‌ని వేడుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.

H3 Class=subheader-styleకోటంరెడ్డి కామెంట్స్./h3p.

ఇరిగేష‌న్ అధికారుల నిర్ల‌క్ష్యంతో సౌత్ మోపూరులో 150 ఎక‌రాల పంట కొట్టుకుపోయింది.ఎఫ్‌డీఆర్ ప‌నులు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీల పొలాలు నీట మునిగిపోయాయి.

నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ల ప‌రిస్థితి అధ్వానంగా త‌యారైంది.ఆర్ అండ్ బీ అధికారుల తీరు దారుణంగా ఉంది.

ఇసుక ట్రాక్టర్లు, టిప్ప‌ర్ల వ‌ల్ల గ్రామాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి ఇసుక కాంట్రాక్ల‌ర్లు శ‌క్తివంతంగా త‌యారయ్యారు వారిని ప్ర‌శ్నించే ధైర్యం అధికారుల‌కు లేదు.

పొట్టేపాళెం క‌లుజు వ‌ద్ద బ్రిడ్జీ నిర్మాణానికి క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెబుతున్నారు.సీపీఎం నాయ‌కులు దీనిపై చేస్తున్న పోరాటానికి రాజ‌కీయాల‌కు అతీతంగా మ‌ద్ద‌తు ఇస్తా.

ఐఏఎస్ లకు వాస్త‌విక ప‌రిజ్ణాణం లేక‌పోవ‌డం ఏసీ రూముల్లో కూర్చోవ‌డంతో కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేదు.

వావిలేటిపాడులోని జ‌గ‌న‌న్న కాల‌నీ నివాస యోగ్యం కాదు 3000 మంది ఇబ్బంది ప‌డుతున్నారు పిడికిడి మ‌ట్టిపోసిన పాపాన అధికారులు పోలేదు.

ఓపిక‌తో ఇన్ని రోజులు అడిగా.ఇక ప్ర‌శ్నించందే ప‌నికాద‌ని ప్ర‌శ్నిస్తున్నా.

ఇప్పుడూ చేయ‌క‌పోతే ఉధ్య‌మం చేయ‌క త‌ప్ప‌దు.కోటంరెడ్డి వ్యాఖ్య‌ల‌తో నివ్వెర‌పోయిన అధికారులు స‌మాదానం కూడా చెప్ప‌లేక ముఖం చాటేసిన అధికార యంత్రాంగం.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం.. అసలేం జరిగిందంటే?