రన్నింగ్ ట్రైన్ బయటకు వచ్చి రీల్స్ చేసిన యువతి.. పోల్‌ తనకు తగలడంతో..?

సోషల్ మీడియాలో( Social Media ) ఫేమస్ కావాలని చాలా మంది రైలు మీద ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తున్నారు.

చాలా సందర్భాలలో అవి బెడిసి కొడుతున్నాయి.వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.దాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఈ వీడియోలో ఒక అమ్మాయి వైరల్ రీల్ చేయాలనే తపనలో ప్రాణంతో చెలగాటమాడుతుంది.

రైలు పరుగులు ( Train Runs )పెడుతుండగా, ఆ అమ్మాయి రైలు నుంచి బయటకు వచ్చి, రైలు డోర్ హ్యాండిల్స్‌ భాగం పట్టుకుని వేలాడుతూ ఒక వీడియో చేయాలని ప్రయత్నించింది.

ఈ సమయంలో రైలు పక్కన ఉన్న ఒక స్తంభానికి అమ్మాయి తల బలంగా గుద్దుకోవడంతో, ఆమె స్పృహ తప్పిపోయే స్థితికి చేరుకుంది.

అది ఫేటల్ హిట్ లా కనిపించింది.ఆమె తలకు పోల్‌ చాలా బలంగా తగలానే ఒక బొమ్మలాగా తను బిగుసుకుపోయింది.

"""/" / అంత బలంగా గుద్దుకున్నా, ఆ అమ్మాయి ఏదోలా ట్రైన్ అలాగే పట్టుకుని ఉండగలిగింది.

లేదంటే, ప్రాణం పోయి ఉండేది.ఈ వీడియో అంతటితో ఆగిపోయింది.

ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏమైందో మనకు తెలియదు.అంటే, ఆమె బతికిందా లేదా అనేది తెలియ రాలేదు.

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపనలో ఎంత ప్రమాదం ఉందో ఈ వీడియో చూపిస్తోంది.

"""/" / ఒక అద్భుతమైన ఫోటో తీయాలనే తపనలో, చాలా మంది యువత ప్రమాదాల గురించి ఆలోచించకుండా, ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నారు.

ఇలాంటి లైఫ్-థ్రెటెనింగ్ స్టంట్స్ చేయడం వల్ల వారికి చాలా తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపన కంటే, సురక్షితంగా ఉండడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది.

చిరంజీవి అంటే అంత ఇష్టమంటున్న బన్నీ.. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుందా?