మహేష్ కు అక్కగా సునీత అంటూ జోరుగా ప్రచారం.. ఆమె ఏమన్నారంటే?
TeluguStop.com
సింగర్ సునీత సినీ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.
అయితే ఆ వార్తలు నిజం కాలేదు.అయితే ఈ మధ్య కాలంలో సునీత గురించి ఫేక్ న్యూస్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్నిరోజుల క్రితం సునీత తల్లి కానున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.
ఆ తర్వాత వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ కు అక్కగా సునీత అంటూ ప్రచారం జరుగుతోంది.
వైరల్ అయిన వార్తలు తన దృష్టికి రావడంతో సునీత స్పందించి వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు.
నేను సినిమాల్లో నటించే అవకాశం లేదని సునీత చెప్పుకొచ్చారు.సినిమాల్లో నటించేంత తీరిక నాకు లేదని సునీత కామెంట్లు చేశారు.
తన గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోందని సునీత చెప్పుకొచ్చారు.సునీత స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.
ప్రస్తుతం సునీత సింగర్ గా ఆఫర్లతో బిజీగా ఉండగా పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారంలోకి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
"""/"/
సునీతకు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో పాపులారిటీ ఉండటం వల్లే ఆమె గురించి ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
సోషల్ మీడియా ద్వారా సునీత ఎప్పటికప్పుడు ఈ ఫేక్ న్యూస్ గురించి స్పందించి స్పష్టత ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సింగర్ సునీతకు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందనే సంగతి తెలిసిందే.
కెనడాలో ఊహించని అద్భుతం.. ఆకాశం నుంచి ఊడిపడిన వింత వస్తువు.. వీడియో చూస్తే!