మెగాస్టార్ బాబీ కాంబో సినిమాకు నిర్మాత ఎవరు.. చిరంజీవి అలా చేయడం సాధ్యమేనా?
TeluguStop.com
సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్( Highest Remuneration ) తీసుకుంటున్న హీరో చిరంజీవి అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఆయన పారితోషికం 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
అయితే చిరంజీవి పారితోషికం భారీగా ఉన్నా ఆయనతో సినిమాలను నిర్మించిన నిర్మాతలకు మాత్రం భారీ లాభాలు అయితే రావడం లేదు.
చిరంజీవి బాబీ( Chiranjeevi Bobby ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు నిర్మాత సెట్ కాలేదని తెలుస్తోంది.టాలీవుడ్ లోని ప్రముఖ బ్యానర్లంతా భారీ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని సమాచారం అందుతోంది.
చిరంజీవి రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దిశగా చిరంజీవి అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.వాస్తవానికి ఈ మధ్య కాలంలో మెగా హీరోలకు బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు ఆశాజనకంగా లేవు.
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ( Ram Charan, Pawan Kalyan )సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేదు.
గత కొన్నేళ్లలో వాల్తేరు వీరయ్య మినహా చిరంజీవి నటించి లాభాలను అందించిన మరో సినిమా అయితే లేదనే చెప్పాలి.
వాల్తేరు వీరయ్య భారీ హిట్టైనా నిర్మాతలకు మరీ భారీగా లాభాలు అయితే రాలేదు.
"""/" /
చిరంజీవి నటించిన విశ్వంభర, చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమాల ఫలితాలను బట్టి చిరంజీవి భవిష్యత్తు సినిమాల ఫలితాలు డిసైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
చిరంజీవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి.చిరంజీవి పాన్ ఇండియా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చిరంజీవి విశ్వంభర మూవీ జులై నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.