క్రిష్‌ విడాకులు.. ప్రచారంలో మరో పుకారు

కెరీర్‌ ఆరంభంలో మివతో కూడిన సినిమాలను తీసిన దర్శకుడు క్రిష్‌ అలియాస్‌ జాగర్లమూడి రాధకృష్ణ ప్రస్తుతం కాస్త కమర్షియల్‌ సినిమాల వైపు చూస్తున్నాడు.

ఒక వైపు బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ చిత్రాన్ని చేస్తున్న ఈయన తెలుగులో త్వరలో బాలకృష్ణతో ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని చేయబోతున్నాడు.

ప్రతిభ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్‌ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం కుదుపుకు లోనవుతుంది.

2016వ సంవత్సరంలో డాక్టర్‌ రమ్యను వివాహం చేసుకున్న క్రిష్‌ గత కొంత కాలంగా ఆమెతో విభేదిస్తూ వస్తున్నాడు.

వీరిద్దరి విభేదాలు తారా స్థాయికి చేరడంతో కలిసి జీవించడం కష్టం అని నిర్ణయించుకుని విడాకులకు సిద్దం అయ్యారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;"img Src="http://telugustop!--in/wp-content/uploads/2018/06/Rumour-about-Director-krishorce!--jpg"/ క్రిష్‌ విడాకులకు కారణం హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ అంటూ ప్రచారం జరుగుతుంది.

కంచె చిత్రంతో ప్రగ్యా జైస్వాల్‌ను క్రిష్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

అప్పటి నుండి కూడా ప్రగ్యాతో క్రిష్‌ సన్నిహితంగా మెలుగుతున్నాడు.ఆమెతో పార్టీలకు పబ్‌లకు తిరుగుతూ, ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

ఆమెతో క్రిష్‌ సహజీవనం సాగిస్తున్నాడు అంటూ ఇలా మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రగ్యా కారణంగానే రమ్య మనసు విరిగిందని, క్రిష్‌తో కలిసి ఉండాలని ఆమెకు లేదంటూ వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మరోరకమైన వార్తలు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి.!--nextpage క్రిష్‌ విడాకులు అనగానే అంతా కూడా ప్రగ్యావైపు చూశారు.

కాని అసలు విషయం ఏంటీ అంటే రమ్య ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో వైధ్యురాలిగా చేస్తుంది.

వైధ్యురాలిగా ఆమె ఎప్పుడు బిజీగా గడుపుతున్నారు.మరో వైపు హిందీ, తెలుగుల్లో సినిమాలు చేస్తూ క్రిష్‌ ఇంకా బిజీగా ఉంటున్నాడు.

ఇద్దరు కూడా వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండటం వల్ల ఇద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగడం లేదు.

ఇద్దరు వారంలో ఒకటి రెండు రోజులు కూడా కలవలేక పోతున్నారట.దాంతో ఇలా జీవితంను జీవించడం కంటే విడిపోయి హాయిగా జీవితాన్ని మరొకరితో సంతోషంగా గడపడం ఉత్తమం అని ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు.

రమ్యకు ఆమె ప్రస్తుతం చేస్తున్న హాస్పిటల్‌లోనే ఒక డాక్టర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి.ఆయన్ను వివాహం చేసుకోవాలని భావిస్తుందట.

క్రిష్‌తో విడాకులు వచ్చినాక రమ్య విదేశాలకు వెళ్లి పోవాలని నిర్ణయించుకుంది.విదేశాల్లో ప్రాక్టీస్‌ చేయాలని రమ్య కోరిక.

అది క్రిష్‌తో ఉంటే కుదరదు.అందుకే రమ్య విడాకులు కోరుకుందని కొందరు అంటున్నారు.

మొత్తానికి సెలబ్రెటీలు విడాకులు తీసుకోబోతున్నా కూడా అదో పెద్ద న్యూస్‌ అయ్యి కూర్చుంది.

వీరిద్దరి విడాకులకు అసలు కారణం ఏంటో ఆ పైవాడికే తెలియాలి.