చిన్న పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ వచ్చిందని పుకార్లు…?
TeluguStop.com
నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఓ విషయం కలకలం రేపుతోంది.చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఒకటి దిగిందని,పిల్లలకు బిస్కెట్స్,చాక్లెట్స్ ఇస్తూ ఎత్తుకెళుతున్నారని సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా వైరల్ కావడంతో ఆ నోట ఈ నోట పడి జిల్లాలో ప్రస్తుతం హల్చల్ అవుతుంది.
దీనితో ప్రజలు,ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.చిన్న పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ వచ్చిందనే వార్త వాస్తవమా? కాదా? అనేది జిల్లాలో ప్రశ్నార్ధకంగా మారింది.
కరీంనగర్ లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే బీహార్ గ్యాంగ్ తిరుగుతున్నారని ప్రచారంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు అప్రమత్తయ్యారు.
ఇక్కడ కొత్త కొత్త వ్యక్తి కనబడ్డా అనుమానిస్తూ
కొన్నిచోట్ల కొంతమందిని పట్టుకొని దేహశుద్ది చేస్తున్న వీడియోలో కూడా వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడే జరిగింది ఫలానా దగ్గర జరిగింది,చిన్నపిల్లల తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు.
మొన్న ఆ గ్రామంలో వచ్చారు.నిన్న ఈ గ్రామంలో వచ్చారు.
అంటూ సిటీలో ఉండే కుటుంబ సభ్యులకు,చిన్న పిల్లల తల్లిదండ్రులకు చరవాణి ద్వారా సంభాషణలు రికార్డ్ చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు.
దీనితో అసలు ఏం జరుగుతుంది?నిజంగానే చిన్నపిల్లల కిడ్నాప్ గ్యాంగ్ లు వచ్చాయా? ఎక్కడైనా పిల్లలు కిడ్నాప్ కు గురైనట్లు కేసులు నమోదు అయ్యాయా? ఒకవేళ అలంటిదేదైనా జరిగితే పోలీసులు అప్రమత్తమై అధికారిక ప్రకటన విడుదల చేస్తారు.
ఇప్పటి వరకు అలాంటిదేమి లేకపోవడంతో ఇదంతా ఫేక్ అని కొంతమంది కొట్టిపడేస్తున్నారు.వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న ఈ అంశం వాస్తవమా? ఆవాస్తవమా? శాంతినగర్ గ్రామస్తుడు బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం నుండి వాట్సప్ గ్రూపుల్లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే బీహార్ గ్యాంగ్ తిరుగుతున్నట్లు అన్ని గ్రూపుల్లో వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇది అసలు వాస్తవమా? అవాస్తవమా? అర్దంకాక ప్రజలు సందేహంలో పడిపోయారు.
వేసవి సెలవులు దగ్గర సమీపిస్తుండటంతో పోలీసులు నిఘా పెంచి కిడ్నాప్ బ్యాచ్ వచ్చిందనే పుకార్లపై క్లారిటీ ఇవ్వాలని,వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని కోరుతున్నారు.
మానవత్వం మంట కలిసిన వేళ.. ఇంట్లోనుంచి అత్తమామలను గెంటేసిన కోడలు